By: ABP Desam | Updated at : 12 May 2022 01:46 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మైనర్ బాలికపై అఘాయిత్యం
Palnadu Crime : పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురజాల పట్టణంలోని ఓ కాలనీలో ఐదు సంవత్సరాల బాలికపై 16 ఏళ్ల మైనర్ లైంగిక దాడి చేసిన సంఘటన గురువారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజినల్ పోలీస్ అధికారి డీఎస్పీ జయరామ్ ప్రసాద్, అర్బన్ సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగర పంచాయతీ గురజాల పట్టణంలో ఓ కాలనీలో బుధవారం సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను ఆడుకుందామని పిలిచి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రి తల్లిదండ్రులు వచ్చే సమయానికి చిన్నారి నలతగా ఉండడంతో చిన్నారిని ప్రశ్నించగా స్థానిక కాలానికి చెందిన యువకుడు తనపై చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో గురువారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
వైఎస్ఆర్ జిల్లాలో మరో దారుణం
ఏపీలో అత్యాచార ఘటనలు వరసగా వెలుగులోకి వస్తున్నయి. విజయవాడ, రేపల్లె ఘటనలు మరిచిపోక ముందే నిత్యం ఏదో చోట మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో బాలికపై ఓ యువకుడు, అతని స్నేహితులు 10 మంది గత కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ ఘటనలో కొసమెరుపు. ఈ ఘటనపై కనీసం కేసు నమోదు చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం మసీదు వద్ద ఓ బాలిక బిక్షాటన చేస్తూ జీవిస్తుంది. చిన్నారి తండ్రి మరో దగ్గర బిక్షాటన చేస్తుంటాడు. బాలిక తల్లి చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తున్న చెంబు అనే యువకుడు బాలికను అత్యాచారం చేశాడు. తన స్నేహితులతో కలిసి గత కొంతకాలంగా బాలికపై ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో విషయం బయటకువచ్చింది.
పోలీసుల తీరుపై అనుమానం
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తనపై చెంబు, అతని స్నేహితులు అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక చెప్పిన సమాచారాన్ని పోలీసులు వీడియో తీసి, సీఐ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సీఐ ఈ విషయం బయటకు రాకుండా బాధితురాలిని గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వచ్చే అమృతనగర్‌లోని ఓ ఆశ్రమానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకుండా బాలికను 8వ తేదీన మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయకుండా, బాలిక ఆశ్రమంలో జాయిన్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బాధితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిందితులను పట్టుకోకుండా బాధితురాలిని స్వచ్ఛంద సంస్థకు తరలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. స్థానికుల నుంచి బాలికపై అత్యాచార ఘటన తమ దృష్టికి వచ్చిందన్న ప్రొద్దూటూరు డీఎస్పీ.. విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
మణిపూర్ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం
ఆన్‌లైన్‌లో మెక్సికన్ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>