Viral News: NRI పై దుండగుల కాల్పులు, కుటుంబ సభ్యులు చేతులెత్తి వేడుకున్నా వినలేదు - వీడియో
Viral Video: పంజాబ్‌లోని అమృత్ సర్‌లో NRI పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడి దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
NRI Attacked: పంజాబ్‌లో అమృత్‌సర్‌లో NRIపై కాల్పులు జరిగాయి. బైక్‌పై వచ్చిన దుండగులు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆస్తి తగాదాలు కారణంగానే ఇలా దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంట్లోని సీసీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలు రికార్డ్ (Viral Video) అయ్యాయి. అమృత్‌సర్‌లోని డబుర్జి గ్రామంలో ఉంటున్న సుఖిత్ చైన్‌పై ఈ దాడి జరిగింది. ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చినట్టు విచారణలో తేలింది. కుటుంబ సభ్యులతో ఉండగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. ముందుగా గన్ చూపించి బెదిరించారు. వేరే గదిలోకి రావాలని వార్నింగ్ ఇచ్చారు. అందుకు సుఖిత్ చైన్ అంగీకరించలేదు. ఆ తరవాత కాల్పులు జరిపారు. దాడి చేసిన వెంటనే అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయారు. ఓ హోటల్ కొనుగోలు విషయంలో ఏదో వివాదం తలెత్తిందని, అదే దాడికి దారి తీసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. సీసీ ఫుటేజ్‌ని ఆధారంగా తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
An NRI, Sukhchain Singh, was shot in his home in Daburji village, Amritsar, after recently returning from the USA. The shocking incident, caught on CCTV, shows two assailants firing three shots at him. He’s now in serious condition and has been admitted to the hospital. pic.twitter.com/74wLSJbaqj
— Baba Banaras™ (@RealBababanaras) August 24, 2024
బతిమాలినా ఆగకుండా కాల్పులు..
అయితే..దాడి చేసిన సమయంలో కుటుంబ సభ్యులు ఆ దుండగులను బతిమాలారు. చేతులెత్తి దండం పెట్టారు. అయినా వినకుండా కాల్చారు. మూడు రౌండ్‌ల కాల్పులు జరిపారు. తల, ఛాతి భాగంలోకి మూడు బులెట్‌లు దూసుకుపోయాయి. ప్రస్తుతం బాధితుని పరిస్థితి విషమంగానే ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. అయితే...సుఖిత్ చైన్ సింగ్ భార్య స్పందించింది. మాజీ భార్య కుటుంబ సభ్యులే ఈ దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. కచ్చితంగా వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సుఖిత్ చైన్ మామయ్య కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేంత వరకూ పోరాడతామని తేల్చి చెప్పారు.
#WATCH | Amritsar, Punjab: On the incident of firing on an NRI Sukhchain Singh, his wife Amandeep Kaur says, "They entered our residence and started firing...We have doubts regarding the involvement of Sukchain Singh's ex-wife's family members in this incident...Proper action… pic.twitter.com/TYBRxFcEKL
— ANI (@ANI) August 24, 2024
Also Read: Viral Video: కోబ్రాకే చుక్కలు చూపించిన కాకి, పొడిచి పొడిచి పాముతో పోట్లాట - వీడియో