Viral Video: కోబ్రాకే చుక్కలు చూపించిన కాకి, పొడిచి పొడిచి పాముతో పోట్లాట - వీడియో
Viral News: కోబ్రాతో ఓ కాకి వీరోచితంగా పోట్లాడింది. ఆ పాము బుసలు కొడుతున్నా వెనక్కి తగ్గకుండా ముక్కుతో పొడిచింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Viral News in Telugu: కోబ్రాతో తలపడిన ఓ కాకి ఆ పాముని ముప్పతిప్పలు పెట్టింది. చాలా సేపు రెండింటి మధ్య యుద్ధం జరిగింది. అంత పెద్ద పాముని కూడా లెక్క చేయకుండా కాకి గట్టిగానే పోట్లాడింది. చివరకు ఓడించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. గోళ్లతో పాముని ఎక్కడికక్కడ రక్కేసింది. పాము బుసలు కొడుతున్నా ధైర్యంగా అలాగే దాడి చేసింది. ఏమీ చేయలేక పాము అలాగే ఉండిపోయింది. 11 సెకన్ల ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోకి 30 లక్షల వ్యూస్ వచ్చాయి. వేలాది మంది కామెంట్స్ పెట్టారు. పామునే భయపెట్టి కాకి గెలవడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
— NATURE IS BRUTAL (@TheBrutalNature) August 22, 2024
ఓ పాముని కాకి ఇంత దారుణంగా ఓడిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు, అద్భుతం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ కాకి ఓ వారియర్ బ్రో అంటూ తెగ పొగిడాడు ఓ నెటిజన్. ఇక కొందరైతే పాముకి పోట్లాడే అవకాశమివ్వకుండా చేసిందంటూ కాకికి హ్యాట్సాఫ్ చెప్పారు. మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇప్పటి వరకూ పాముల్ని చూసి భయపడే వాడిని. ఇకపై కాకుల్ని చూసి భయపడాలేమో అని ఫన్నీగా చెప్పాడు. డాక్యుమెంటరీల్లోనే చూసే ఇలాంటి అద్భుతాలు..నిజంగా జరిగాయంటే నమ్మలేకపోతున్నామని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Also Read: Viral Video: షాకింగ్ వీడియో - కుక్కపై మొసలి దాడి, మూడు క్షణాల్లో మింగేసింది
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















