Viral Video: షాకింగ్ వీడియో - కుక్కపై మొసలి దాడి, మూడు క్షణాల్లో మింగేసింది
Viral News: ఓ నదీ తీరంలో ఆహారం వెతుక్కుంటున్న కుక్కపై మొసలి దాడి చేసింది. క్షణాల్లోనే నోట కరుచుకుని మింగేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral News in Telugu: ఓ నది వెంట నడుచుకుంటూ వెళ్తున్న కుక్కపై మొసలి అమాంతం దాడి చేసింది. గట్టిగా నోట కరుచుకుంది. అది విడిపించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. క్షణాల్లోనే ఆ మొసలి కుక్కని మింగేసింది. మెల్లగా మళ్లీ నీళ్లలోకి వెళ్లిపోయింది. ఇదంతా మూడు సెకన్లలో జరిగిపోయింది. అక్కడే ఉన్న కొందరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే ఈ వీడియో వైరల్ అయిపోయింది.
— Wildlife Uncensored (@TheeDarkCircle) July 30, 2024
అయితే..ఎక్కడ ఈ ఘటన జరిగిందన్నది మాత్రం తెలియలేదు. ఆ మొసలి దాడి చేసిన తీరు మాత్రం ఒళ్లు జలదరించేలా ఉంది. భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ఆ నదీ తీరంలోనే ఓ కుక్క తిరుగుతోంది. ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని వెతుకుతోంది. అప్పుడే హఠాత్తుగా నీళ్లలో నుంచి వచ్చిన మొసలి ఆ కుక్కను నోట కరుచుకుంది. ఆ కుక్క బాధతో విలవిలలాడి పోయింది. తప్పించుకునేందుకు ప్రయత్నించేలోగా అమాంతం మింగేసింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఇది చూసి గట్టిగా కేకలు వేశారు. జులై 30వ తేదీన ఈ వీడియో Xలో పోస్ట్ కాగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా వ్యూస్ రాగా కామెంట్స్ వెల్లువెత్తున్నాయి.
Viral News: Viral News: మోదీని, యోగి ఆదిత్యనాథ్‌ని పొగిడినందుకు భార్యకి ట్రిపుల్ తలాక్, తీవ్రంగా హింసించి ఆపై విడాకులు