Nizamabad Crime News: భర్తను హత్య చేసి భార్య హైడ్రామా, సాయం చేసిన కుమారుడు! ఇదో వెరైటీ క్రైమ్ స్టోరీ
Nizamabad Crime News: అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడనికట్టుకున్న వాడినే కడతేర్చిందో ఇల్లాలు. ఆపై తన భర్త అదృశ్యమయ్యాడంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి చివరకు దొరికిపోయింది.
Nizamabad Crime News: మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంది. భర్తే దైవంగా భావించాల్సిన భార్య అతని పాలిట మృత్యువైంది. సినిమాటిక్ లో కట్టుకున్న భర్తనే మట్టుబెట్టింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. మరో ముగ్గురు సాయంతో భర్తను చంపి పూడ్చి పెట్టేసింది. పైగా తన భర్త అదృశ్యం అయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యే భర్తను హత్య చేసినట్లు బయట పడింది.
భర్త రంజిత్ అదృశ్యం అయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు..
కేసును చేధించిన ఆర్మూర్ ఏసీపీ ప్రభారర్ రావు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన బట్టు జమున, రంజిత్ కుమార్ భార్యా భర్తలు. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన తన భర్త అదృశ్యం అయ్యాడంటూ భార్య బట్టు జమున పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు దోషి భార్య జామున అని తేలింది. జమున గొల్ల నగేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరికి భర్త రంజిత్ కుమార్ అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం భర్తను హత్య చేసింది.
ఈ హత్యలో గొల్ల నగేష్ తో పాటు జమున తండ్రి బైండ్ల గంగారాం, జమున పెద్ద కొడుకు కూడా చేయి వేశారు. అయితే తండ్రిని చంపేందుకు కుమారుడు, మామ ఒప్పుకోవడం గమనార్హం. భర్త వేధిస్తున్నాడంటూ జమున చెప్పిన మాటలు విన్న వాళ్లు రంజిత్ ను చంపేందుకు ఆమెతో చేయి కలిపారు. మొత్తం నలుగురు కలిసి మద్యం మత్తులో ఉన్న రంజిత్ కుమార్ ను పొలంలో కర్రలతో గట్టిగా తలపై బాదారు. అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత అక్కడే ఉన్న మామిడి చెట్టు వద్ద గోతి తవ్వి పూడ్చేశారని నిందితురాలు జమున విచారణలో ఒప్పుకున్నట్లు ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు.
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడే చంపినట్లు ఒప్పుకున్న భార్య
రంజిత్ ను పూడ్చి పెట్టిన సమాధి వద్ద అనుమానం రాకుండా గట్టి కూడా వేశారు. జమున సెల్ ఫోన్ నుంచి గొల్ల నగేష్ కు ఎక్జువ సార్లు ఫోన్ కాల్స్ వెళ్లాయి. అనుమానం వచ్చిన పోలీసులు జమున, గొల్ల నగేష్ ను విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే తన భర్త రంజిత్ కుమార్ ను నగేష్, తండ్రి బైండ్ల గంగారాం, తన పెద్ద కొడుకు కలిసి హత్య చేశామని ఒప్పుకున్నారు. శవాన్ని పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించామని తెలిపారు ఏసీపీ ప్రభాకర్ రావు. కేసు చేధించిన ఎస్సై వినయ్ వారి టీంను ఏసీపీ ప్రభాకర్ రావు అభినందించారు.