అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Basara IIIT News: బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం, ఐదుగురిపై కేసు నమోదు!

Basara IIIT News: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Basara IIIT News: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్  విద్యార్థులను  ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులు ఐదుగురి పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 323, 526 ప్రకారం.. ర్యాగింగ్ యాక్ట్ పై  విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. స్టూడేంట్ వేల్పేర్ డీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై మహేశ్ తెలిపారు. జూనియర్  విద్యార్థులను  ర్యాగింగ్ పేరుతో రకరకాలుగా వేధించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే  చంపేస్తామని బెదిరించారు. దాంతో జూనియర్ విద్యార్థులు ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందింంచిన అధికారులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు అయ్యాయి. 

వారం రోజుల క్రితమే ఐబీఎస్ కాలేజీలో ఇలాంటి ఘటనే..

హైదరాబాద్ శంకర్‌పల్లిలోని ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో సంచలనం అయింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు విచక్షణారహింతగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వీడియోలు వైరల్ కావడంతో విశ్వవిద్యాలయం యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఈ నెల 1వ తేదీన ర్యాగింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీనియర్లు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు రాజీ కుదిర్చి పంపినట్టు తెలుస్తోంది. బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేయడంతో 12 మంది సీనియర్‌ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం  12 మంది విద్యార్థులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.  ఈ ఘటనపై ఐబీఎస్‌లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాప్తు అనంతరం మరికొంత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రేమ వ్యవహారంతో?

శంకర్‌పల్లి సమీపంలోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఐబీఎస్ కాలేజీ హాస్టల్‌ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ యువకుడు, యువతి కొంతకాలంగా లవ్ చేసుకుంటున్నారు. వారు దూరపు బంధువులు కూడా అవుతారు. అయితే కొన్ని రోజుల క్రితం వీరి మధ్య చిన్న  మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయాన్ని యువతి తన బంధువైన సీనియర్‌ విద్యార్థికి చెప్పింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్‌లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. ఆ తర్వాత బాధిత యువకుడి స్నేహితులు సీనియర్లపై దాడికి పాల్పడ్డారు. సీనియర్ల దాడిలో గాయపడిన ఓ విద్యార్థికి హాస్టల్ లోనే చికిత్స చేశారు. హాస్టల్లో విద్యార్థులు ఘర్షణ పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ శంకరపల్లి ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్ కల్చర్ పేరిట సీనియర్ విద్యార్థులు రెచ్చిపోయారు. జూనియర్ పై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. సీనియర్ల పేరిట జూనియర్ విద్యార్థిపై ఇష్టం వచ్చినట్లు ర్యాగింగ్ చేసి, బూతులు తిడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐబీఎస్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పేరిట దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఓ విద్యార్థి హాస్టల్ రూంలోకి వచ్చిన సీనియర్లు జూనియర్ చిత్రహింసలు పెడుతూ రక్తం వచ్చేలా దాడికి పాల్పడ్డారు. ఈ వీడియోలో కొంత మంది సీనియర్లు, జూనియర్ పై దాడి చేశారు. ఆ యువకుడిపై కూర్చుని దారుణంగా తన్నుతూ, బూతులు తిడుతూ, దాడి చేశారు. పక్కనున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులను టాగ్ చేస్తూ ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget