Nellore News : నెల్లూరు జిల్లాలో దారుణం, తల్లి, కూతురు అనుమానాస్పద మృతి, భర్త ఆత్మహత్య!
Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇసుకపల్లిపాలెంలో ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
Nellore News : నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇసుకపల్లిపాలెం గ్రామానికి చెందిన మురళి(24) అదే గ్రామానికి చెందిన స్వాతి(19)ని సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలె వారికి కూతురు పుట్టింది. గత రోజులుగా పుట్టింటిలో ఉన్న స్వాతి ఐదు రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చింది. అయితే ఆదివారం స్వాతి, నెలల పాప అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. వీరి శరీరంపై గాయాలనున్నట్లు పోలీసులు గుర్తించారు. గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
భర్తే హత్య చేశాడని అనుమానాలు!
అయితే ఇంట్లోని మరో గదిలో మురళి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ముగ్గురు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ మరణాలకు కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే భార్య, బిడ్డలకు విషం ఇచ్చి భర్తే హత్య చేశాడని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తెలియనున్నాయి.
కర్నూలులో మరో దారుణం!
కర్నూలు జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలో మహిళ భాగ్యలక్ష్మి మృతి వివాదాస్పదంగా మారింది. ఆమె భర్త జైహింద్ బాబు చనిపోయారు. ఆమెకు దామగట్ల యశోద, కల్పనాదేవి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన సోదరి కల్పనాదేవి తల్లిని హత్య చేసిందని యశోద ఆరోపించింది. తల్లి పేరిట బీమా డబ్బు, బంగారు నగలు, ఆస్తి కోసం కల్పన ఈ దారుణానికి పాల్పడిందని అంటున్నారు. అందుకే బంధువులకు చెప్పకుండా అంత్యక్రియలు పూర్తిచేసిందని యశోద ఆరోపిస్తుంది. తల్లి మృతిపై విచారణ జరపాలని యశోద కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు హత్య, కుట్ర కింద కేసు నమోదు చేశారు. పోలీసులు భాగ్యలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
Also Read : SSLV-D1 Latest Update: ఇక ఆ శాటిలైట్స్ పనికిరావు, SSLV రాకెట్‌లో జరిగిన లోపం ఏంటంటే: ISRO
Also Read : Minister Roja New Car: లంచాలు తీస్కొని కారు కొన్నానట! జబర్దస్త్‌గా ఎన్ని లక్షలు వచ్చాయో చూస్కోండి - రోజా