News
News
వీడియోలు ఆటలు
X

Nellore News : తరగతి గదిలోనే బీటెక్ విద్యార్థినికి అబార్షన్, కాసేపటికే మృతి!

Nellore News : నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో తరగతి గదిలోనే విద్యార్థినికి అబార్షన్ అయింది. కాసేపటికే విద్యార్థిని మృతి చెందింది.

FOLLOW US: 
Share:

Nellore News : నెల్లూరులో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థినికి అబార్షన్ అయింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే యువతి మృతిచెందింది. మర్రిపాడు మండలానికి చెందిన యువతి(19) ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. ఏప్రిల్ 11న విద్యార్థులంతా కాలేజీ ఆవరణలో ఉండగా... ఆ యువతి క్లాస్ రూమ్ లో ఉండిపోయి గడియపెట్టుకుంది. ఎంతసేపటికీ ఆ విద్యార్థిని బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు తలుపులు పగలగొట్టారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉంది యువతి. ఆమె పక్కనే ఆరు నెలల గర్భస్థ పిండం కనిపించింది. వెంటనే విద్యార్థులు యువతిని, పిండాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువతి మరణించిందని వైద్యులు నిర్థారించారు.  

అసలేం జరిగింది? 

నెల్లూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థిని అబార్షన్‌ కారణంగా క్లాస్ రూమ్ లో మృతిచెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11న కాలేజీ విద్యార్థులందరూ ప్రాంగణంలో ఉండగా యువతి గదిలో ఉండిపోయి తలుపులు వేసుకుంది. దీంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా.. తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె పక్కనే ఆరు నెలల పిండాన్ని గుర్తించారు. వెంటనే తోటి విద్యార్థులు తల్లిని, పిండాన్ని స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లాస్ రూమ్ లో అబార్షన్‌ అయ్యిందా? లేక వీడియో చూసి తానే అబార్షన్‌ చేసుకుందా? అనే కోణలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి సెల్‌ఫోన్ ఆధారంగా అనంతసాగరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

మ్యాచింగ్ సెంటర్ లో భార్యపై భర్త దాడి

ఆడవాళ్లతో షాపింగ్‌కు వెళ్తే మగవాళ్లకు ఎలాంటి నరకం ఉంటుందో చాలా సినిమాల్లో కామెడీగా చూపించారు. కానీ అలాంటి సీన్లు సీరియస్ అయితే ఎంత భయంకరంగా ఉంటాయో తాజాగా ఓ ఘటన చెబుతోంది. కరీంనగర్ టౌన్‌లో ఉన్న టవర్ సర్కిల్ మ్యాచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. ఈ ఏరియాలోఉన్న మయూరి మ్యాచింగ్ సెంటర్ కు ఇద్దరు భార్యభర్తలు వచ్చారు. ఏమయిందే ఏమో కానీ కాసేపటికి ఆ భార్య కడుపులో కత్తెర దిగింది. ఆమె అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. భర్త అక్కడ్నుంచి పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న ఆ మ్యాచింగ్ సెంటర్ నిర్వహకులు చెప్పిందేమిటంటే.. భర్తనే కత్తెర తీసుకుని భార్యను పొడిచి పారిపోయాడు.                               

దుకాణానికి వచ్చేంత వరకూ ఆ భార్యభర్తలు బాగానే ఉన్నారని.. అన్యోన్యంగానే ఉన్నారని  దుకాణం యజమానులు చెబుతున్నారు. అయితే.. షాపింగ్ ప్రారంభించిన  తర్వాత ఎంతకూ తనకు కావాల్సిన మ్యాచింగ్ దొరకలేదని చెప్పి అదే పనిగా ఆమె సమయం వేస్ట్ చేస్తూండటంతో భర్తకు కోపం వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరగా తేల్చాలని భర్త అంటూంటే.. నింపాదిగా ఆమె అన్ని మ్యాచింగ్ పీసులనూ చూస్తూండటంతో... భర్తకు కోపం వచ్చిందని అంటున్నారు. కోపం పట్టలేక అందుబాటులో ఉన్న కత్తెర తీసుకుని దాడి చేసినట్లుగా చెబుతున్నారు. భార్యకు కరెక్టుగా కడుపులో కత్తెర గుర్చుకుంది. రక్తస్రావం కారకుండా చున్నీ కట్టి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Published at : 15 Apr 2023 04:19 PM (IST) Tags: AP Latest news Abortion btech student Nellore News classroom

సంబంధిత కథనాలు

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?