Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Nandyal News : ఒకరికి తెలియకుండా మరొకర్ని ముగ్గుర్ని పెళ్లి చేసుకుంది. అత్తారింటిలో ఉండాలంటే డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన మూడో భర్త పోలీసులను ఆశ్రయించారు.

FOLLOW US: 

Nandyal News : ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా ముగ్గురిని వివాహం చేసుకుంది ఓ మహిళ. ఆస్తి కోసం పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లి కూతురు మోసాలు నంద్యాల జిల్లాలో వెలుగుచూశాయి. ఆస్తి తన పేరిట రాయాలని డిమాండ్ చేయడం లేకపోతే విడాకులు ఇస్తానని బెదిరించడం ఆమె ట్రిక్. మహిళపై అనుమానం వచ్చిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగింది? 

నంద్యాల జిల్లా మిట్నాల గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె విడాకులు ఇవ్వకుండా ముగ్గుర్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మిట్నాలకు చెందిన మేరీ జసింట అలియాస్‌ మేరమ్మ కుమార్తె శిరీషకు గతంలో అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జునతో తొలి వివాహం జరిగింది. మల్లికార్జునతో విడాకులు తీసుకోకుండానే ఆత్మకూరు మండలం కొత్తపల్లెకి చెందిన శ్రీనివాసరెడ్డిని శిరీష రెండో పెళ్లి చేసుకుంది. అతడితో కూడా విడాకులు తీసుకోకుండానే బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం వాసి మహేశ్వరరెడ్డిని మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. మహేశ్వరరెడ్డికి కూడా రెండో పెళ్లి కావడంతో ఆయన పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే శిరీష్ తనకు రక్షణగా రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయాలని కోరింది. రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయగా, ఫిబ్రవరి 5న మద్దిలేటిస్వామి ఆలయంలో పెళ్లి అయింది. 

నాలుగో పెళ్లికి సిద్ధం! 

శిరీష తల్లి మేరమ్మ ఆర్‌ఎస్‌ రంగాపురం తరచూ వస్తూ తన కూతురిని అత్తారింట్లో ఉంచాలంటే మరికొంత డబ్బు, ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. శిరీష్, ఆమె తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి శిరీష గురించి విచారించారు. దీంతో ఆమెకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుసుకొని షాకయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అయితే ముగ్గురిని మోసం చేసిన శిరీష తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం.

Also Read : Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్

Also Read : Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!

Published at : 27 May 2022 08:28 PM (IST) Tags: AP News Crime News marriage Nandyal news woman three marriage

సంబంధిత కథనాలు

Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ

Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ

Tirupati Police Thiefs : దోపిడీ చేసిన పోలీసులు - సీఐ, ముగ్గురు ఎస్సైలపై వేటు ! వీళ్లనేమనాలి ?

Tirupati Police Thiefs :  దోపిడీ చేసిన పోలీసులు - సీఐ, ముగ్గురు ఎస్సైలపై వేటు ! వీళ్లనేమనాలి ?

Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్

Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్

Sri Satyasai District Auto Accident: ఆటో ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి- బాధితులకు రూ. 10 లక్షల పరిహారం- రూ. 50 లక్షలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్

Sri Satyasai District Auto Accident: ఆటో ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి- బాధితులకు రూ. 10 లక్షల పరిహారం- రూ. 50 లక్షలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్

Sri Satyasai: సత్యసాయి జిల్లాలో ఘోరం, ఆటోలో వెళ్తున్న 8 మంది సజీవ దహనం

Sri Satyasai: సత్యసాయి జిల్లాలో ఘోరం, ఆటోలో వెళ్తున్న 8 మంది సజీవ దహనం

టాప్ స్టోరీస్

BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్‌ డౌన్‌’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు

BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్‌ డౌన్‌’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !