ముస్లిం దంపతులను కొట్టి చంపిన హిందువులు, యూపీలో దారుణం
UP Crime News: యూపీలో ఓ ముస్లిం దంపతులను హిందూ వర్గం కొట్టి చంపింది.
UP Crime News:
యూపీలో ఘటన..
యూపీలో దారుణం జరిగింది. ఓ ముస్లిం కుటుంబానికి చెందిన భార్యాభర్తల్ని విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఐరన్ రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ యువతిని ముస్లిం యువకుడు ప్రేమించడమే కాకుండా ఈ ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోవడం రెండు కుటుంబాల్లోనూ కలకలం రేపింది. ఈ అసహనంతోనే యువతి కుటుంబ సభ్యులు ఆ ముస్లిం యువకుడి తల్లిదండ్రులపై దాడి చేశారు. అబ్బాస్, కమ్రూల్ నిషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కొన్నేళ్ల క్రితం యువతీ యువకులు పారిపోయారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై కేసు పెట్టారు. కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. కొద్ది రోజుల క్రితమే విడుదలయ్యాడు. ఈ జంటపై దాడి చేయాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..2020లో వీళ్లిద్దరూ పారిపోయారు. అప్పటికి ఆ యువతి మైనర్. పోలీసు కేసు నమోదు చేసిన వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే..ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ మరోసారి పారిపోయారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ కోపంతోనే యువతి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు. యువకుడి తల్లిదండ్రులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
ముస్లిం యువకుడిపై దాడి..
ఇటీవలే యూపీలోని బులందశర్‌లో ఓ ముస్లిం యువకుడిని ముగ్గురు దారుణంగా కొట్టారు. "జై శ్రీరాం" అని నినాదాలు చేయాలంటూ చితకబాదారు. అలా కొడుతూ వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఆ వీడియోలోని ఇద్దరు నిందితులనీ అదుపులోకి తీసుకున్నారు. జూన్ 13న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. జూన్ 17న వాళ్లను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం..జూన్ 13వ తేదీన బాధితుడు సాహిల్ బస్‌స్టాండ్‌లో నిలబడి ఉన్నాడు. అప్పుడే ఓ ముగ్గురు యువకులు బైక్‌పైన వచ్చి బలవంతంగా సాహిల్‌ని కూర్చోబెట్టుకున్నారు. ఎవరూ లేని చోటకు తీసుకెళ్లారు. తమలో ఒకరి మొబైల్ పోయిందని, చోరీ చేసింది నువ్వేనా అని ప్రశ్నించారు. తనకేమీ తెలియదని బాధితుడు బదులిచ్చాడు. ఆ తరవాత ముగ్గురూ చెట్టుకి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. గుండుకొట్టించారు. జై శ్రీరాం అని గట్టిగా నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే...పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా తనపై దొంగతనం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించాడు బాధితుడు. అంతే కాదు. ఆ ముగ్గురిపై పెట్టిన కేసుని విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు.
Also Read: లద్దాఖ్ డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేస్తున్న రాహుల్‌కి థాంక్స్, కేంద్రమంత్రుల సెటైర్లు