News
News
వీడియోలు ఆటలు
X

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు అయింది.

FOLLOW US: 
Share:

Mla Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు అయింది. ముంబయిలో జనవరి 29వ తేదీన జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై స్థానిక పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. రాజాసింగ్ పై IPC section 153A 1(a) కింద కేసులు నమోదు అయ్యాయి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై ఆరోపణలు ఉన్నాయి. 

రాజాసింగ్ పై కేసు నమోదు

జనవరి 29న ముంబయిలోని హిందూ సకల్ సమాజ్ మోర్చాలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేసినందుకు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్‌పై గ్రేటర్ ముంబయి పోలీసులు దాదర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రాజా సింగ్‌పై IPC సెక్షన్ 153-A (1) (a) కింద కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మత సామరస్యానికి విఘాతం కలిగించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

జనవరి 29న జరిగిన కార్యక్రమంలో 

సకల్ హిందూ సమాజ్ జనవరి 29న ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతిని కోరింది. శివాజీ పార్క్ నుంచి దాదర్‌లోని మహారాష్ట్ర స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వరకు సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళలను దుర్వినియోగం చేయడం, వారి భద్రత, గౌరవానికి ఆటంకం కలిగించడాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మార్చ్‌కు పోలీసులు అనుమతించారు, నిర్వహకులు ర్యాలీ కూడా నిర్వహించారని, అందులో ఎమ్మెల్యే రాజా సింగ్ రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని, ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పేర్కొన్నారు. 

లవ్ జిహాద్ పై వ్యాఖ్యలు 

ర్యాలీలో పాల్గొన్న ఇతర బీజేపీ నాయకులు ఈ విధంగా మాట్లాడకపోయినా, రాజా సింగ్ దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  ప్రసంగంలో 'లవ్-జిహాద్' గురించిమాట్లాడారు. "హిందూ సమాజం అంతా కలిసి ఒక సంఘం ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడవలసిన సమయం. మన సోదరీమణులు, కుమార్తెలు ఈ వ్యవస్థీకృత పథకాలకు బలిఅవుతున్నారు. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదని నేను ప్రతి హిందువును కోరుతున్నాను." అని రాజాసింగ్ అన్నారు.  

రాజాసింగ్ పై పీడీ యాక్ట్ 

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ కేసులో రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది.   

Published at : 30 Mar 2023 03:49 PM (IST) Tags: Mumbai TS News MLA Raja Singh Police Hate speech

సంబంధిత కథనాలు

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!

TikTok Challenge: ప్రాణం తీసిన టిక్‌టాక్ ఛాలెంజ్‌, స్కార్ఫ్‌ మెడకు చుట్టుకుని బాలిక మృతి

TikTok Challenge: ప్రాణం తీసిన టిక్‌టాక్ ఛాలెంజ్‌, స్కార్ఫ్‌ మెడకు చుట్టుకుని బాలిక మృతి

Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్

Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్

ప్రియురాలిని హత్య చేసిన యువకుడు, డెడ్‌బాడీని ట్యాంక్‌లో దాచి మిస్సింగ్ అంటూ డ్రామా

ప్రియురాలిని హత్య చేసిన యువకుడు, డెడ్‌బాడీని ట్యాంక్‌లో దాచి మిస్సింగ్ అంటూ డ్రామా

14 రోజుల రిమాండ్‌కు అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ

14 రోజుల రిమాండ్‌కు అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!