అన్వేషించండి

Mira Road Murder: వాసన రాకుండా శవం ఎలా పడేయాలో గూగుల్ లో సెర్చింగ్! ముంబయి హత్య కేసులో కీలక విషయాలు

Mira Road Murder: ముంబయి సరస్వతి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెబ్ సిరీస్ చూసి హత్య చేసిన మనోజ్.. గూగుల్లో సెర్చ్ చేసి బాడీని ఎక్కడ, ఎలా పారేయాలో డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Mumbai Murder: మూడు రోజుల క్రితం ముంబయిలో జరిగిన అత్యంత దారుణ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు నిందితుడు మనోజ్.. సరస్వతి శరీర భాగాలను ఎలా, ఎక్కడ పారేయాలి, దుర్వాసన రాకుండా ఏం చేయాలనే విషయాల గురించి గూగుల్ లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వెబ్ సిరీస్ చూసి మనోజ్.. సరస్వతిని హత్య చేసినట్లు తేల్చారు. సరస్వతిని చంపిన తర్వాత మృతదేహాన్నిమనోజ్ ఫొటో కూడా తీసినట్లు గుర్తించారు. అయితే హత్య అనంతరం పోలీసులకు చిక్కిన నిందితుడు.. సరస్వతి, తాను అనాథలం అని చెప్పాడు. కానీ అదంతా అబద్ధం అని పోలీసులు వెల్లడించారు. సరస్వతి హత్య జరిగినట్లు తెలుసుకున్న తర్వాత ఆమె ముగ్గురు సోదరీమణులు పోలీసులను ఆశ్రయించారు. అయితే నిజమేనా కాదా అని తెలుసుకునేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. అనంతరం వారందరినీ అక్కాచెల్లెళ్లుగా నిర్ధారించుకొని.. సరస్వతి మృతదేహాన్ని వారికి అప్పగించారు. 

అసలేం జరిగిందంటే?

మూడు రోజుల క్రితం ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గీతానగర్‌లోని ఫేజ్‌-7 లో ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్‌ గురించి తెలియలేదు. 

బాడీని ముక్కలు చేసి పడేయాలనుకున్న నిందితుడు

అప్పటికే స్పాట్‌లో ఉన్న నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధావాకర్  హత్యను గుర్తు చేసింది ఈ మర్డర్. బాడీని ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పారేయాలని అనుకున్నాడు. వాటిని కట్ చేయడానికి కట్టర్ మెషీన్‌ని వాడాడు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న ఆమె బాడీని కనిపించకుండా చేయాలని ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు. 

"మనోజ్ సానే, సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సరస్వతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని మనోజ్ గమనించాడు. దీనిపై మూడు, నాలుగు రోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ చూసి మరీ విషమిచ్చి హత్య చేశాడు. పోలీసులు తనను అనుమానిస్తారేమో అన్న భయంతో డెడ్‌బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూశాడు. కట్టర్‌తో శరీరాన్ని ముక్కలుగా కోశాడు. వాటిని దాచి పెట్టాడు. కొన్నింటిని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. బైక్‌పై వాటిని పెట్టుకుని వాటిని పారేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ ఇంటిని సీజ్ చేసి ఆ మహిళ శరీర భాగాల్ని సేకరించాం"

టాప్ హెడ్ లైన్స్

Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget