News
News
X

Mulugu Crime : ములుగు జిల్లాలో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

Mulugu Crime : వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో ప్రియుడి మోజులో భార్య భర్తను హత్య చేసింది.

FOLLOW US: 
Share:

Mulugu Crime :  ప్రియుడితో కలిసి భర్తను హతమర్చిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పూరూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం హతమార్చిన ఘటన వాజేడు మండలంలో కలకలం రేపుతోంది. వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన గొడ్డె బసవయ్య, సుజాత భార్య భర్తలు. అయితే బసవయ్య భార్య సుజాత అదే గ్రామానికి చెందిన దర్శన్ బాబుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై భార్య, భర్తలు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టుకొని వార్నింగ్ ఇచ్చారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ప్రియుడు పెండకట్ల దర్శన్ బాబుతో కలిసి బసవయ్యను భార్య సుజాత హతమార్చింది. బసవయ్య బావ గోట లాలయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పేరూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బసవయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. 

మర్డర్ చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ 

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర ఎంతో నమ్మకంగా పని చేసే ఓ అనాథ డ్రైవర్ పేరిట అతడికి తెలియకుండా బ్యాంకులో 52 లక్షల లోన్ తీసుకున్నాడు. మరో 50 లక్షల రూపాయల బీమా కూడా తీసుకున్నాడు. ఆపై పోలీసులకు డబ్బు ఆశ చూపించి అతడిపై హత్యకు ప్లాన్ చేశారు. ఫుల్లుగా మద్యం తాగించి హాకీ స్టిక్ తో దాడి చేశారు. శవాన్ని రోడ్డుపై పెట్టి దానిపైనుంచి రెండు సార్లు కారును పోనిచ్చారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం జరిగిన ఆ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడతాండాకు చెందిన బోడ శ్రీకాంత్ మోసాలకు పాల్పడుతూ జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. అయితే హైదరాబాద్ శివారు మోడిపల్లికి చెందిన 34 ఏళ్ల భిక్షపతి అతని వద్ద డ్రైవర్ గా పని చేసేవాడు. అనాథ అయిన అతని పేరుపై శ్రీకాంత్ ఓ సంస్థలో 50 లక్షల రూపాయలకు బీమా చేయించాడు. అతడి పేరిటే మరో 52 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. దానికి నామినీగా అతని పేరు పెట్టుకున్నాడు. అనంతరం భిక్షపతిని హత మార్చేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతీలాల్ తో పాటు తన దగ్గర పని చేసే సతీష్, సమ్మన్నలకు డబ్బు ఆశ చూపించాడు. డబ్బులు తీసుకున్న వాళ్లు.. భిక్షపతిని చంపేందుకు సాయం చేశారు.  

బీమా డబ్బుల కోసం 

మోతీలాల్ వేసిన పథకం ప్రకారం.. 2021 డిసెంబర్ 22వ తేదీన భిక్షపతిని కారులో ఎక్కించుకొని బాగా మద్యం తాగించారు. అర్ధరాత్రి షాద్ నగర్ కు చేరుకొని.. అటు నుంచి మొగలిగిద్ద వైపు పయనం అయ్యారు. గ్రామ శివారులో అతనిపై హాకీ స్టిక్ తో దాడి చేసి హత్య చేశారు. శవాన్ని రోడ్డుపై ఉంచి రెండుసార్లు కారును పైనుంచి పోనిచ్చారు. ఇలా చేయడంతో భిక్షపతి మృతదేహం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం అనంతరం హత్యగా ధ్రువీకరించారు. బీమా డబ్బుల కోసం నిందితులు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో పోలీసులకు క్లూ దొరికింది. బీమా సంస్థ నిర్వాహకులు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాల కోసం పోలీసులను సంప్రదించారు. బీమా డబ్బుకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి భిక్షపతితో బంధుత్వం లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు రంగంలోకి దిగి పూర్తి ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఉద్యోగాల ఆశ పెట్టి కొందరు యువకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకొని బ్యాంకుల్లో డబ్బులు కాజేయడంతో గతంలో నాచారం పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ పై కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు.

Published at : 10 Jan 2023 09:04 PM (IST) Tags: Crime News Lover Extra marital relationship Husband murder Mulugu News

సంబంధిత కథనాలు

Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్‌లో మరో దారుణం!

Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్‌లో మరో దారుణం!

UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!

Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!

Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!

Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్