News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం

ఏలూరులో కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తుపట్టలేనంతగా ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

FOLLOW US: 
Share:

ఏలూరులో కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తుపట్టలేనంతగా ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటిపై ఉన్న గదిలో వృద్ధురాలి మృతదేహం ఉండగా.. అదే ఇంట్లో కింది గదిలో ఉంటున్న తన కోడలికి విషయం తెలియకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకే కన్నతల్లిని చంపి విషయం బయటకు రాకూడదనే భయంతో సుమారు మూడు నెలలుగా ఆమె మృతదేహాన్ని ఇంటి పై గదిలో ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు లోనితంగెళ్ళమూడి యాదవ్ నగర్ మహిషాసుర మర్దిని ఆలయ సమీపంలో శరణార్థి నాగలక్ష్మి (75) నివాసం ఉంటుంది. భర్త మల్లికార్జునరావు విజయవాడ ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన మృతి చెందారు. వచ్చే పింఛన్తో సొంత ఇంటిలోనే పై భాగంలో వృద్ధురాలు నివసిస్తుంది. ఆమె కుమారుడు దుర్గ ప్రసాద్, భార్య లలితాదేవి కింద పోర్షన్లో ఉంటున్నారు. వృద్ధురాలు ఇంటి తలుపులు మూసి ఉండటం, ఆమె కనిపించకపోవడం,  ఎంతకీ దుర్వాసన తగ్గకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  

మంగళవారం పోలీసులు సిబ్బందితో అక్కడికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా వృద్ధురాలి మృతదేహం కనిపించింది. అక్కడ కుళ్ళిపోయిన స్థితిలో పురుగులు పట్టి వృద్ధురాలి మృతదేహం కనిపించింది. దీన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆమె మృతి చెంది మూడు నెలలై ఉంటుందని ప్రాధమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అనంతరం మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగలక్ష్మి కి ఆమె కుమారుడు ప్రసాద్కు కొంతకాలం నుంచి మాటలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడే ఏదైనా చేశాడా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి తోడు పోలీసులు వచ్చిన దగ్గరనుంచి అతను కనిపించలేదు. తర్వాత అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మూడు నెలల కిందట ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల వాళ్ళు అడగగా పిల్లి చనిపోయిందని తీయించి వేస్తామని అతడు చెప్పినట్లు స్థానికులు తెలిపారు.

మృతురాలి కోడలు లలిత మాత్రం తనకు ఏమీ తెలియదని తన అత్తగారు తమకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లు భావిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. పిల్లి చనిపోయిందని అందుకే దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల వారిని నమ్మించారు. ఇప్పుడు తీరా వృద్ధురాలు మృతదేహం బయటపడగానే ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కొడుకు దుర్గాప్రసాద్ తన తల్లిని చంపి భయంతో మృతదేహాన్ని పై ఫ్లోర్ దాచి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ఘటన స్థలానికి చేరుకున్న ఏలూరు డిఎస్పి శ్రీనివాసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతురాలు నాగమణి మృతదేహాన్ని మూడు నెలలగా దాచిపెట్టడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆమె సహజంగా మరణిస్తే ఎందుకు ఇన్ని రోజులు మృతదేహాన్ని దాచిపెట్టారు? ఒకవేళ ఇది హత్య? అయితే దీనికి గల కారణాలు ఏమిటి? లేకపోతే ఆత్మహత్య? అయితే మృతదేహం కుళ్ళిపోయే వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Published at : 27 Sep 2023 06:36 PM (IST) Tags: Case Registered mother death Decomposed Dead Body yeluru

ఇవి కూడా చూడండి

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

టాప్ స్టోరీస్

ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్‌జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్‌జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
×