News
News
X

Vizag Crime: ఇద్దరు పిల్లల్ని బావిలో తోసేసిన కన్న తల్లి, వెంటనే ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను బావిలో పడేసి, తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

FOLLOW US: 

విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను నూతిలో పడేసి తల్లి ఆత్మ హత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిని అతి కష్టమ్మీద స్థానికులు కాపాడారు. విశాఖపట్నం జిల్లాలోని రోలుగుంటలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలివీ..

విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను బావిలో పడేసి, తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు భాను (5), పృథ్వి (3) మృతి చెందగా, తల్లిని స్థానికులు ప్రాణాలతో కాపాడారు. రోలుగుంట మండలానికి చెందిన గడదాసి నాగరాజుతో 6 సంవత్సరాల క్రితం ఇదే మండలం వడ్డిపకు చెందిన సాయితో ఈమెకు వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు నాగరాజు స్వగ్రామం జె.నాయుడు పాలెంలో నివాసం ఉంటున్నారు. వీరికి భాను (పాప) పృథ్వి (బాబు) జన్మించారు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం ఈ అఘాత్యానికి పాల్పడింది. నాగరాజు ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. రోలుగుంట పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి 48 గంటల డెడ్‌లైన్, స్పందించకుంటే అన్ని కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసుల ముట్టడి

గతంలో అనంతపురంలోనూ..
గతంలో అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పుట్టపర్తిలో ఓ మహిళ తన ముగ్గురు కుమార్తెలను బావిలో తోసేసి ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ఘటనలో ముగ్గురు కుమార్తెలు మృతి చెందగా, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ, రమేశ్‌ దంపతులు పుట్టపర్తి సమీపంలోని పెదకమ్మ వారి పల్లి దొమ్మర పాలెంలో నివాసం ఉంటున్నారు. ఈ భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాలనీ సమీపంలో ఉన్న బావిలో ముగ్గురు కుమార్తెలను తోసేసి అరుణ కూడా దూకింది. దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి వారిని బయటకు తీశారు. అయితే కుమార్తెలు భవ్య (8), చందన (5) అప్పటికే మృతి చెందగా.. భార్గవి (8), తల్లి అరుణను ఆసుపత్రికి తరలించారు. అక్కడ భార్గవి చికిత్స పొందుతూ మరణించింది. అరుణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భార్గవి, భవ్య ఇద్దరు కవల పిల్లలు. ఈ ఘటనపై పుట్టపర్తి అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు.

News Reels

Also Read: Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతరలో తొలిఘట్టం - పగిడిద్దరాజు రాకతో జాతర ప్రారంభం, 16న మేడారానికి

Published at : 14 Feb 2022 02:40 PM (IST) Tags: Visakhapatnam News Children in well Mother children Visakhapatnam mother Mother kills children Rolugunta News

సంబంధిత కథనాలు

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

Rajasthan Crime News: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హత్య చేయించిన భర్త, అనుమానం రాకుండా ప్లాన్

Rajasthan Crime News: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హత్య చేయించిన భర్త, అనుమానం రాకుండా ప్లాన్

Warangal Crime News: రోడ్‌పై మీ వెహికల్‌ను పార్క్ చేస్తున్నారా- ఇలాంటి గ్యాంగ్‌ ఉంటే కష్టమే!

Warangal Crime News: రోడ్‌పై మీ వెహికల్‌ను పార్క్ చేస్తున్నారా- ఇలాంటి గ్యాంగ్‌ ఉంటే కష్టమే!

వెంటబడిన ఎస్సై, స్పీడ్ పెంచిన ప్రియుడు, ప్రాణం విడిచిన ప్రియురాలు!

వెంటబడిన ఎస్సై, స్పీడ్ పెంచిన ప్రియుడు, ప్రాణం విడిచిన ప్రియురాలు!

Hyderabad News: విద్యార్థిని అత్యాచారం కేసులో విస్తుపోయే వాస్తవాలు - ఆ వీడియోలు చూసి రెచ్చిపోయిన బాలురు ! 

Hyderabad News: విద్యార్థిని అత్యాచారం కేసులో విస్తుపోయే వాస్తవాలు - ఆ వీడియోలు చూసి రెచ్చిపోయిన బాలురు ! 

టాప్ స్టోరీస్

YSRCP BC Meeting : 84 వేల మందితో జయహో బీసీ సభ - బెజవాడలో ఏర్పాట్లు ప్రారంభించిన వైఎస్ఆర్‌సీపీ !

YSRCP BC Meeting : 84 వేల మందితో జయహో బీసీ సభ - బెజవాడలో ఏర్పాట్లు ప్రారంభించిన వైఎస్ఆర్‌సీపీ !

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Gold Movie Review - 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా

Gold Movie Review - 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా