By: ABP Desam | Updated at : 12 Oct 2021 09:38 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
మానవ సంబంధాలకు మాయని మచ్చ ఇదీ. ఇంత నీచమైన స్థితిలో సంబంధాలు ఉంటాయా అని విస్మయం కలిగించేలా ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని.. కొడుకు, తల్లి ప్రియుడిగా మార్చుకున్నారు. అతణ్ని ఇంట్లోనే ఉంచుకొని సంబంధాలు కొనసాగిస్తుండడంతో భర్త తట్టుకోలేకపోయాడు. గొడవలు మొదలయ్యాయి. చివరికి తమ సంబంధానికి భర్త అడ్డుతగులుతున్నాడని ముగ్గురూ కలిసి అతణ్ని అంతమొందించారు. ఇంతటి దారుణమైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భార్యకి, కొడుక్కీ ఒకడే ప్రియుడు ఉండడాన్ని భర్త నిలదీశాడు. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మిట్టపెల్లి రాజు అనే వ్యక్తి.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి హైదరాబాద్‌కు చెందిన జాజు రాజేశ్ అనే వ్యక్తితో 5 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. రాజు చిన్నప్పటి నుంచి స్వలింగ సంపర్కుడు. దీంతో ఇద్దరికీ శారీరక సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత రాజేశ్‌ను తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి రాజు ఇంట్లోనే రాజేశ్ ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు తల్లితో కూడా రాజేశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది రోజులకు ఈ విషయం ఇంట్లో భర్తకు తెలిసింది.
Also Read: హుజురాబాద్ బలిపశువు హరీష్ రావే .. టీఆర్ఎస్ -బీజేపీ కలిసే రాజకీయం చేస్తున్నాయంటున్న రేవంత్
ఈ అనైతిక విషయాలు రాజు తండ్రి కృష్ణకు తెలియడంతో ఇంట్లో పెద్ద గొడవలు జరిగాయి. దీంతో కృష్ణను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ముగ్గురూ కలిసి ఆయన హత్యకు ప్రణాళిక చేశారు. దీనిలో భాగంగా దైవదర్శనానికి వెళదామని కృష్ణను నమ్మించి వేములవాడ రాజన్న దర్శనానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఈ నెల 4న కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లారు. కొండపైన ఓ కాటేజీలో గది అద్దెకు తీసుకొన్నారు. రాత్రి పూటుగా మద్యం తాగిన తర్వాత నలుగురి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే వేసుకొన్న ప్లాన్ ప్రకారం.. ముగ్గురూ కలిసి కృష్ణ కాళ్లు, చేతులు కట్టేశారు. గొంతు నులిమి చంపేసి పరారయ్యారు. పోలీసులు రాజును అరెస్టు చేయగా.. మిగతా ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నారు.
Also Read: Flying Ghost: పొలంలో ఘోస్ట్ రైడర్... బొమ్మను చూసి పక్షులు పరార్... యువరైతు వినూత్న ఆలోచన
Also Read: కేసీఆర్ పీఠం కూలుస్తా... టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడను... ఈటల రాజేందర్ ఫైర్
Viral News: అరే ఏంట్రా ఇదీ ! ఏకంగా రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు - ఇద్దరు ఉద్యోగులపై వేటు !
Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
Turkey Earthquake: టర్కీ, సిరియాలో భారీ భూకంపం, 1300 మందికి పైగా మృతి - భారత్ ఆపన్న హస్తం !
TSRTC Bus Accident : ఛాతీలో నొప్పి బస్సులోంచి దూకేసిన డ్రైవర్, ఆర్టీసీ బస్సు బోల్తా
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, 10 మంది మృతి
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!