Medchal News: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్
Medchal News: మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్.. అర్ధరాత్రి సమయంలో మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడడం తీవ్ర కలకలం రేపింది.
Medchal News: అర్ధరాత్రి సమయం.. ఓ డిప్యూటీ తహసీల్దార్ మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఉద్యోగం విషయం మాట్లాడేందుకు అంటూ ఇంట్లోకి వచ్చిన అతడి చూసి సదరు అధికారణి తీవ్రంగా భయపడింది. ఈ క్రమంలోనే గట్టిగా కేకలు వేయగా... భద్రతా సిబ్బంది వచ్చి అతడిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సదరు డిప్యూటీ తహసీల్దార్ ను అరెస్ట్ చేశారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
తెలంగామ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ... హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న మహిళా ఐఏఎస్ కు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే సదరు అధికారిణి చేసిన ట్వీట్లకు... ఓ డిప్యూటీ తహసీల్దార్ ఒకరి రెండు సార్లు రీట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారుగా నేరుగా ఆమె ఉండే నివాస సముదదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ో హోటల్ యజమానిని వెంట తీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్ కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు.
ముందు ఉన్న స్లైడింగ్ డోర్ ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు కొట్టాడు. డోర్ తెలిచిన మహిళా ఐఏఎస్ కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో తీవ్రంగా భపడిపోయారు. తేరుకున్న ఆమె, నువ్వెవరు, ఎందుకొచ్చావను అని గట్టిగా ప్రశ్నించింది. అందుకు అతను గతంలో నేను మీకు ట్వీట్ చేశానని.. తన ఉద్యోగం గురించి మాట్లేందుకు వచ్చానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గుర్తైన ఆమె బయటకి వెళ్లాలని చెబుతూ కేకలు వేసినట్లు సమాచారం. ఈలోపే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
నిన్నటికి నిన్న వరంగల్ లో బాలిక కిడ్నాప్..!
వరంగల్ లో బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్ లోని 4వ తరగతి చదువుతున్న ముతుల్ అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాపు వెళ్లగా, అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్చీఫ్ లో మత్తుమందు పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. బాలికను ఓ వ్యాన్లో తీసుకెళ్తున్న క్రమంలో వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాన్ ఆపి టీ తాగుతుండగా, బాలికకు స్పృహ రావడంతో వాళ్ల చెర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. టాటా ఏస్ లో వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.