Mangalagiri: కుర్రాడ్ని పంపిస్తే సరుకుల డబ్బులు ఇస్తా - తీరా వెళ్లి చూస్తే మైండ్ బ్లాక్, షాప్ ఓనర్లకు షాక్
Mangalagiri News: మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న షాపులకు వెళ్లిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే పీఏ అని చెప్పి వేల రూపాయాల సామాను తీసుకున్నాడు. చివరికి ఊహించిని ట్విస్ట్ ఇచ్చాడు.
Lakshmi Narasimha Temple In Mangalagiri: ఎమ్మెల్యే పీఏ అంటూ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సమీపంలో రెండు కిరాణా షాపుల నుండి సుమారు 20 వేల రూపాయల మేరకు మోసం చేశాడు. ఎమ్మెల్యే పీఏ అంటూ సరుకులు తీసుకుని ఉడాయిస్తున్న విషయం మంగళగిరిలో వెలుగు చూసింది. వర్తకులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవస్థానం సమీపంలోని ఓ కిరాణా దుకాణం వద్దకు మురళి అనే వ్యక్తి వచ్చాడు. తాను ఎమ్మెల్యే పీఏ నని చెప్పి సరుకుల లిస్ట్ ఇచ్చి, మీ షాపు కుర్రాడితో తాను చెప్పిన అడ్రస్ కి పంపమని చెప్పి వెళ్లిపోయాడు.
కాసేపటి తర్వాత ఫోన్..
కొద్దిసేపటి తర్వాత అతను షాపు యజమానులుకి ఫోన్ చేసి మంగళగిరి బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న వీజే కాలేజీ రోడ్డులో కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తికి సరుకుల సంచి ఇచ్చి వెళ్లాలని సూచించాడు. తాను టీడీపీ ఆఫీసులో మీటింగులో ఉన్నానని ఆఫీస్ గేటు దగ్గరకు వస్తే డబ్బులు ఇచ్చి పంపిస్తానని చెప్పాడు. మురళి అనే వ్యక్తి చెప్పిన ప్రకారమే షాప్ లో పనిచేసే కుర్రాడు సరుకుల సంచిని అతను చెప్పిన కొబ్బరి బొండాల వ్యాపారి అందజేసి టీడీపీ ఆఫీసుకు వెళ్లాడు. వెళ్లిన అతను ఎంతకీ రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని గుర్తించారు.
డబ్బుల కోసం వెళ్లిన కుర్రాడు.. కానీ!
అనుమానం వచ్చి ఆ షాపు కుర్రాడు తిరిగి కొబ్బరి బొండాల వ్యాపారి వద్దకు వచ్చి అడగగా నువ్వు ఇచ్చి వెళ్లిన వెంటనే ఎవరో వ్యక్తి తీసుకెళ్లాడని చెప్పాడు. తానే ఇక్కడ సంచి పెట్టమని చెప్పానని తనకు చెప్పి సరుకులు తీసుకెళ్లాడని వివరాలు తెలిపాడు. డబ్బులు ఇవ్వలేదని చెప్పడంతో తాము మోసపోయానని గ్రహించి షాపు కుర్రాడు వెనుదిరిగాడు. తిరిగి వెళ్లి షాపు యజమానులకు విషయం చెప్పగా ఎమ్మెల్యే పీఏ అని చెప్పి మోసం చేశారని గ్రహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మోసాలకు పాల్పడుతున్న వ్యక్తికి ఫోన్ నెంబరు (9494323553) మరియు సీసీటీవీ ఫుటేజీలను ఫోటోలను మంగళగిరిలోని ఇతర వర్తక వ్యాపారులకు పంపి మిగతా వారందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి. మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. ఈ ఆలయం సమీపంలోనే తిరిగే వ్యక్తి కిరాణా షాపు వారిని ఎమ్మెల్యే పీఏ అని చెప్పి వేల రూపాయల సరుకులు తీసుకెళ్లి మోసాలకు పాల్పడ్డారు.
Also Read: Kapu Leaders Meet: విశాఖలో కాపు నేతల భేటీ, రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా అడుగులు
Also Read: Prakash Raj on AP Govt: చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? : ప్రకాశ్ రాజ్