Raghu Rama House Reccy : ఎంపీ రఘురామ ఇంటి చుట్టూ రెక్కీ - ఒకరిని పట్టుకున్న సీఆర్పీఎఫ్ !
ఎంపీ రఘురామ ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అయితే అతను తాను ఏపీ పోలీసునని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
Raghu Rama House Reccy : వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి చుట్టూ ఆరుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం కలకలం రేపుతోంది. ఎంపీకి సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఉంది. రెక్కీ నిర్వహిస్తున్న విషయం వారు కనిపెట్టి పట్టుకోబోయారు. ఒకరు దొరికారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారు. దొరికిన వ్యక్తి తన పేరు ఓ సారి సుభాన్ అని మరోసారి భాషగా చెబుతున్నారు. సుభాన్ అలియా భాష అని చెబుతున్నారు. తాను విజయాడలో పోలీస్ ఉద్యోగినని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అతని వద్ద ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవు. ఐడెంటీటీ కార్డు కూడా లేదు. పట్టుకున్న సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో వారు ఆ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.
వాళ్లు ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులా ?
దొరికిన వ్యక్తి తో పాటు పరారైన మిగిలిన ఐదుగురు ఇంటలిజెన్స్ పోలీసులా ? లేకపోతే దుండగులా అన్నదానిపై స్పష్టత లేదు. కదలికలపై ఏపీ ఇంటలిజెన్స్ చాలా కాలంగా నిఘా ఉంచిందన్న ఆరోపణలులు ఎంపీ చేస్తున్నారు. ఈ క్రమంలో భీమవరంలో జరగనున్న ప్రధాని మోదీ కార్యక్రమానికి ఆయన హాజరవుతారన్న కారణంగా ఆయన ఇంటి వద్ద నిఘా పెట్టినట్లుగా భావిస్తున్నారు. అయితే నర్సాపురం వెళ్లేందుకు రైలు ఎక్కి మళ్లీ దిగిపోయారు. ఈ క్రమంలో మళ్లీ ఉదయం విమానంలో వెళ్తారేమోనన్న ఉద్దేశంతో ఆయన ఇంటి వద్ద ఇంటలిజెన్స్ నిఘా పెట్టినట్లుగా భావిస్తున్నారు.
మిగిలిన వారు ఎందుకు పారిపోయారని సీఆర్పీఎఫ్ అనుమానం
అయితే వారు పోలీసుల్లా లేరని దుండగుల్లా ఉన్నారని రఘురామ వర్గీయులు అనుమానిస్తున్నారు. రఘురామపై దాడికి ప్రణాలిక వేస్తున్నారన్న అనుమానాలను వ్యక్తం చేస్తన్నారు. అందుకే ఆ దుండగుడ్ని బేగం పేట పోలీసులకు అప్పగించారు. అయితే ఫిర్యాదు చేశారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. తాను పోలీసునని పట్టుబడ్డ వ్యక్తి నమ్మకంగా చెబుతున్నారు. అయితే రెక్కీ నిర్వహిస్తారా ... ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు ? మిగిలిన ఐదుగురు ఎందుకు పారిపోయారు ? ఏ ఉద్దేశంతో కాపలా కాస్తున్నారన్న అంశాలపై స్పష్టత లేదు.
గచ్చిబౌలి పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది
గతంలోనూ ఇలాగే ఓ సారి రెక్కీ నిర్వహించి ఆయన పుట్టిన రోజు నాడు ఇంట్లోనే అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా ఇంటలిజెన్స్ పోలీసులు సివిల్ డ్రెస్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలి పోలీసులు ఆ దుండగుడు ఎవరో విచారణ జరిపి ప్రకటన చేస్తేనే కానీ క్లారిటీ రాదు.