అన్వేషించండి

Qnet Case: క్యూనెట్‌ కేసులో కీలక నిందితుడు ఉపేంద్ర నాథ్ రెడ్డి అరెస్ట్‌

Qnet Case: మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ క్యూనెట్‌ కేసులో సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు మంగళవారం మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు.

Qnet Case: మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ క్యూనెట్‌ కేసులో సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు మంగళవారం మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా, చిన్నంపల్లి గ్రామానికి చెందిన సీహెచ్‌ ఉపేంద్ర నాథ్‌ రెడ్డిని సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉపేంద్ర నాథ్‌ రెడ్డి మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నిందితుడు బెంగళూరులో తలదాచుకున్నట్టు సీసీఎస్‌ పోలీసులకు సమాచారం అందింది. సోమవారం అక్కడకు అక్కడి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం నగరానికి తరలించి అరెస్ట్‌ చేశారు. 

2017లో తెలంగాణ ప్రభుత్వం మల్టీమార్కెటింగ్‌పై నిషేధం విధించింది. కర్ణాటకకు  చెందిన రాజేష్‌ఖన్నా, ఏపీలోని కర్నూలు జిల్లా చెన్నమ్మపల్లి గ్రామనివాసి ఉపేంద్రనాథ్‌రెడ్డి మరికొందరితో కలసి క్యూనెట్‌ పేరు మార్చి విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ వ్యాపారం చేపట్టారు. మోటివేషన్ క్లాసులు నిర్వహించేవారు. సామాన్యులను మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌లో పెట్టుబడులను ఆకర్శించేవారు. ఈ క్రమంలో పెట్టుబడుల పెట్టిన వారికి నెలకు రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపారు. ఈ మోసాన్ని నమ్మించేందుకు మొదట వారికి కొంత మొత్తంలో లాభాలు చూపించారు.

ప్రజలను సులువుగా నమ్మించేందుకు సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో సంస్థ పేరు మీద కార్యాలయం ఏర్పాటు చేశారు. దొరికినంతా దోచుకోవడానికి రిజిస్ట్రేషన్‌ ఫీజుగా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50,000-1,50,000 చొప్పున రాష్ట్రంలో 163 మంది బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేశారు. కొద్ది కాలం లాభాలు చూపించారు. అది నమ్మి కొందరు ఏకంగా లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే కొద్ది కాలానికి అసలు, లాభాలు ఇవ్వకుండా నిర్వాహకులు ముఖం చాటేస్తూ వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పలుమార్లు నిర్వాహకులను నిలదీశారు. అయితే వారిని నమ్మించేందుకు కొత్త సభ్యులను చేర్పిస్తే డబ్బు తిరిగి ఇస్తామంటూ మెలికపెట్టి  కొందరిని ఉద్యోగులుగా మార్చుకున్నారు.

ఈ ఏడాది మే నెలలో స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ కేసు దర్యాప్తులో విహాన్‌ మల్టీలెవల్‌ మోసాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ (క్యూనెట్‌)పై మహంకాళి పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అనంతరం అదనపు సీపీ(ఎస్‌ఐటీ) ఆదేశాల మేరకు ఈ కేసులను హైదరాబాద్‌ సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీనిపై దృష్టి సారించిన సీసీఎస్ పోలీసులు నిందితులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో వి–అంపైర్‌ పేరుతో నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో గుర్తించిన అధికారులు 15 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో రాజేష్‌ఖన్నా, ఉపేంద్రనాథ్‌రెడ్డి కీలక సూత్రధారులుగా తేలింది. ఈ కేసులో ఉప్పటి వరకు 15 మంది నిందితులను గుర్తించారు. గతంలో 8 మందిని అరెస్ట్‌ చేశారు. 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్లు సీజ్‌ చేశారు. ఉపేంద్రనాథ్‌రెడ్డి కదలికలపై నిఘా ఉంచి తాజాగా అరెస్ట్‌ చేశారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget