News
News
X

Loan App Racket: సరికొత్త పంథాలో లోన్ యాప్ చీటర్స్, అలాంటి ఫోన్ కాల్స్ తో జాగ్రత్త సుమీ!

Loan App Racket: రోజురోజుకూ ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య ఎక్కువగా లోన్ యాప్స్ నిర్వాహకులు వివిధ నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ.. లోన్ తీస్కోని వాళ్లను కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. 

FOLLOW US: 

Loan App Racket: లోన్ యాప్ నిర్వాహకులు సరికొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ... అమాయకపు ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో లోన్ తీసుకున్న వాళ్లనే టార్గెట్ చేసే దళారులు, ఇప్పుడు డబ్బున్న వాళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ దోచేస్తున్నారు. విపరీతంగా వేధిస్తూ.. డబ్బులు గుంజుతున్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యాపారిని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు బరితెగించారు. అతని సన్నిహితులు, బంధువులకు అభ్యంతరకర మెసేజ్ లు, ఫోన్ కాల్స్ చేసి డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వారం క్రితం ఓ లోన్ యాప్ ద్వారా 1700 లోన్ తీసుకున్నట్లు ఏడు రోజుల కాల పరిమితి ముగిసినప్పటికీ డబ్బులు చెల్లించడంలేదంటూ అభ్యంతకరమైన మెసేజ్ లతో రవి కుమార్ ను వేధించడం మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా అసలు 1700 వడ్డీ 1300 అసలు కలిపి మొత్తం 3 వేలు చెల్లించాలని పోన్ చేసి వేధిస్తున్నారు. రవి కుమార్ ను చోర్, సెక్స్ వర్కర్ గా చిత్రీకరిస్తూ అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి వాట్సాప్ మెసేజ్, ప్రైవేట్ నెంబర్లతో ఫోన్లు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తను తీసుకొని డబ్బులు చెల్లించలేదంటూ చేస్తున్న ప్రచారానికి రవి కుమార్ కంగుతిన్నాడు. లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న టార్చర్ కు మానసిక వేదనకు గురయ్యాడు. 

సన్నిహితుల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు పోలీసులను సంప్రదించాలని చెబుతున్నారు.  

లోన్ యాప్ బెదిరింపులతో ఇటీవలే యువకుడి ఆత్మహత్య..

News Reels

లోన్ ఆప్ బెదిరింపులు ఎంసెట్ ర్యాంకర్ ప్రాణాలు తీశాయి. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న విద్యార్థిని సైతం లోన్ యాప్ వేధింపులు వదిలిపెట్టలేదు. భయాందోళనతో ఎంసెట్ ర్యాంకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు కష్టపడి చదివి ఎంసెట్లో రెండు వేల ర్యాంకు సాధించాడు. అయితే రుణ యాప్ వల కు చిక్కి చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది. కరీంనగర్ కి చెందిన ముని సాయి అనే యువకుడ్ని లోన్ యాప్ బెదిరింపులు ఆత్మహత్య చేసుకునేలా చేశాయి.

కరీంనగర్ సమీపంలోని నగునూరుకు చెందిన శ్రీధర్ - పద్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ముని సాయి(19) ఉన్నారు. ఇటీవల జరిగిన ఎంసెట్ 2022 పరీక్షల్లో ముని సాయికి 2000 ర్యాంకు వచ్చింది. ఎంతో సంతోషంలో మునిగిపోయిన ఆ కుటుంబం ముని సాయి ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేశారు. ముందుగా కౌన్సిలింగ్ కి హాజరు కావడానికి హైదరాబాద్ కి వచ్చి శంషాబాద్ లోని తన స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. పట్టణంలోని వివిధ కాలేజీలకు సంబంధించి వివరాలు సేకరిస్తూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడు. కౌన్సిలింగ్ కాగానే పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచన చేశాడు. 

నాలుగు నెలల కిందట ఎలా ట్రాప్ లో పడ్డాడో ఏమో గాని లోన్ ఆప్ (Loan App)లకు సంబంధించి మెసేజ్ రావడంతో వాటి నుండి లోన్ కోసం అప్లై చేశాడు. కేవలం పదివేల రూపాయల లోన్ ఎం-పాకెట్, ధని యాప్ ల ద్వారా తీసుకున్నాడు. అయితే E యాప్ నిర్వాహకులు కాల్ సెంటర్ నుండి వరుసగా ఫోన్ చేస్తూ బెదిరించడంతో ఇప్పటికీ దాదాపు 45 వేల రూపాయల వరకు తిరిగి చెల్లించాడు ముని సాయి. అంతటితో ఆగని యాప్స్ సిబ్బంది మరో 15000 రూపాయలు కట్టాలంటూ పరుషమైన పదజాలంతో ముని సాయిని బెదిరించారు. అంతేకాకుండా తనకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లకు సైతం తను చీటర్ అంటూ ఫొటోలు పెడతామని బెదిరించసాగారు. 

నిజంగానే పరిస్థితి అంతవరకు వెళుతుందని భయపడ్డ ఎంసెట్ ర్యాంకర్ ముని సాయి ఈనెల 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతడ్ని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న ముని సాయి శుక్రవారం రోజు మృతి చెందాడు. ఒకవైపు దాదాపుగా 50,000 కట్టిన మరోవైపు ముని సాయి ట్రీట్మెంట్ కోసం మూడు లక్షలు ఖర్చు చేశారు. లోన్ యాప్ వేధింపుల కారణంగా ఓవైపు లక్షల డబ్బుు ఖర్చు చేసినా, అన్నదాత కుమారుడి జీవితం అర్దంతరంగా ముగిసినట్లయింది. 

Published at : 26 Sep 2022 01:50 PM (IST) Tags: Loan App Racket Loan App Cheaters Loan App Chetings Bhadradri News Aswaraopeta News

సంబంధిత కథనాలు

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!