By: ABP Desam | Updated at : 19 Oct 2022 02:34 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన పేరు సిద్ధప్ప. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కున్నూరుకు చెందిన సిద్దప్ప కోడుమూరులో తన అనుచరులతో ఉన్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి చంపారు. పక్కా ప్రణాళిక రచించుకొని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో సిద్దప్ప అక్కడికక్కడే చనిపోయారు.
సిద్దప్ప అనే వ్యక్తి గతంలో కొన్ని హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2008లో హత్యకు గురైన టీడీపీ నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు మర్డర్ కేసుతో పాటు కున్నూరు గ్రామంలో జరిగిన మూడు హత్యల్లో ఈ సిద్ధప్ప నిందితుడిగా ఉన్నారు. అయితే, వివిధ కారణాలతో ఆయన అంతకుముందు ముందు నుంచి ఉంటున్న కున్నూరు గ్రామంలో కాకుండా కోడుమూరులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజా హత్య జరిగింది.
అయితే, పాత కక్షలు పెంచుకోవడం వల్లే ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని సిద్దప్ప మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కోడుమూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్లో మరో దారుణం!
UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!
Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!
Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్