అన్వేషించండి

Asifabad News: గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి, డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

Asifabad News: అప్పటి వరకు హ్యాపీగా గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నాడు. అందరితో కలిసి నృత్యం చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే గుండెపోటుతో మృతి చెందాడు. 

Asifabad News: గణేష్ నిమజ్జనోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఓ యువకుడు అప్పటివరకు అందరితో కలిసి తెగ డ్యాన్స్ చేశాడు. ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు, స్నేహితులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలపడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.

గణేష్ నిమజ్జనం వేడుకల్లో విషాదం 
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం వేడుకల్లో విషాదం చోటు చేసుకోంది. స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తూ మండపం వద్ద తిరుమలేష్ (18) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని హూటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిమజ్జనం సమయంలో యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఇలా ఆకస్మికంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు అప్పటి వరకు తమతో కలిసి డ్యాన్స్ చేసిన స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడాన్ని స్నేహితులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద వార్త గ్రామస్థులందరినీ అందరిని కలచి వేసింది.

మొన్నటికి మొన్న స్టేజీపైనే డ్యాన్స్ చేస్తూ.. 
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. స్టేజీపై నృత్యం చేస్తోన్న ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిగా తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ జరిగింది.. 
జమ్మూలోని బిష్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతి క కార్యక్రమంలో యోగేశ్‌ గుప్తా (20) అనే కళాకారుడు పార్వతీదేవి వేషధారణలో నృత్యం చేశాడు. కాసేపు నృత్యం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే అక్కడున్న వారంతా నృత్యం చేస్తున్నాడని భావించి అతని వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కొద్ది క్షణాలైన లేవకపోయేసరికి.. శివుడి వేషధారణలో ఉన్న మరో వ్యక్తి యోగేశ్‌ను లేపేందుకు వెళ్లాడు. అయితే ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు కారణంగా యోగేశ్‌ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

యూపీలోనూ ఇలాగే..! 
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో ఇలాంటి తరహా ఘటనే జరిగింది. స్నేహితుడి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ఓ వైద్యుడు అతనికి సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండాపోయింది.

ఇదే కారణమా? 
పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చిన్నవయసులోనే గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫలితంగా గుప్పెడు గుండె కొట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ, ఆగే పరిస్థితులు తెచ్చుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రంగా హార్ట్ ఎటాక్ వచ్చి సెకన్లలో గుండె ఆగిపోతే, సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం ఉండదు కానీ, కొందరిలో మైల్డ్ గా, లేదా మధ్యస్థ స్థాయిలో హార్ట్ ఎటాక్ వస్తుంది. అలాంటప్పుడు సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget