News
News
X

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Kothhagudem Crime News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు వ్యభిచార గృహాలపై సోమవారం పోలీసులు దాడులు చేశారు. అందులో వ్యభిచార గృహాల్లో 15 మంది బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది.  

FOLLOW US: 
Share:

Kothhagudem Crime News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంకా వ్యభిచార గృహాలపై దాడులు కొనసాగిస్తున్నారు. సోమవారం పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహిస్తూ... విటులతోపాటు వేశ్యలను అరెస్ట్ చేశారు. అమాయకులైన  బాలికలను ఈ వ్యభిచార కూపంలోకి లాగుతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహాల్లో 15 మంది బాలికలు ఉన్నట్లు సమాచారం. ప్రత్యేకంగా వ్యభిచార గృహాల ఏర్పాటు చేసి బాలికలు, యువతులను అక్కడికి తీసుకెళ్తున్న కొంతమంది నిర్వాహకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా ఎక్కడెక్కడ వ్యభిచార కేంద్రాలు కొనసాగుతున్నాయన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం మధ్యాహ్నం పోలీసు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. 

పేదరికంలో ఉన్న బాలికలు, యువతులు, అనాథలే లక్ష్యంగా ఈ దందా సాగిస్తున్నారు నిర్వాహకులు. వారికి వారి తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఈ నరక కూపంలోకి లాగుతున్నారు. కొందరి ఫొటోలను తీసి బ్లాక్‌మెయిల్‌కు దిగి తమకు నచ్చినట్టు ఆడించుకునే వారని సమాచారం. 

20 రోజుల క్రితం కరీంనగర్ లో కూడా..

కొంతకాలంగా వరుస కేసుల్లో పేరు నానుతున్న కరీంనగర్ కి సంబంధించిన మరో కేసు సంచలనంగా మారింది. భారీ ఎత్తున నెట్వర్క్ మైంటైన్ చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారని, దానికి సంబంధించిన పలువురు నిందితుల అరెస్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో అనంతపురం జిల్లా.. తెలంగాణలో కరీంనగర్ జిల్లాకి  ఈ సెక్స్ రాకెట్ నిందితులతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఇదే విషయంపై యాదాద్రి భువనగిరి జిల్లాలో నిఘా వేసిన పోలీసులకు ఓ ముఠా చిక్కింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ అనే మహిళ ఇద్దరు ఆడపిల్లలను కొనుగోలు చేసి వారి ఆలనా పాలనా చూసింది. అయితే ఇదంతా ఏదో వారి జీవితం నిలబెట్టడానికి కాదు. యుక్త వయసు రాగానే వారితో వ్యభిచారం చేయించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసింది.

దీనికి తగ్గట్టుగానే తమ దగ్గర బంధువైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాసి కంసాని శ్రీనివాస్ ని సంప్రదించింది. తంగళ్ళపల్లిలో ఉండే శ్రీనివాస్ ఈ ప్రపోజల్ కి అంగీకరించి ఆ బాలికలను తీసుకొని వచ్చి దందా షురూ చేశాడు. మరోవైపు కోరినప్పుడల్లా అనసూయ వద్దకు ఆ అమ్మాయిలను పంపిస్తూ ఉండేవాడు. అయితే ఈ వ్యవహారం నచ్చని ఆ అమ్మాయిలు తిరగబడినప్పుడల్లా వారిని అనసూయ తన సహచరుల సాయంతో తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసేది. దీంతో ఆ అమ్మాయిలు ఎలాగైనా అక్కడి నుండి పారిపోవాలని నిర్ణయించుకొని ఒకరోజు సమయం చూసి ప్లాన్ చేసిన కేవలం ఒక అమ్మాయి మాత్రమే అనసూయ బారి నుంచి తప్పించుకోగలిగింది.

అయితే అలా తప్పించుకున్న బాలిక జనగామ జిల్లాలోని బస్టాండ్ లో పోలీసుల కంటపడగా ఆమెను విచారించారు. దీంతో తనతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నారంటూ ఆ బాలిక యాదగిరి పల్లికి చెందిన అనసూయ కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి కి చెందిన శ్రీనివాస్ పై కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సైదులుకి సమాచారం అందించారు. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఇక ఈ నెల మూడో తేదీన ఆఫీసర్ ఫిర్యాదుతో యాదగిరిగుట్ట పోలీసులు షీ టీమ్స్ చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు యాదగిరి పల్లిలోని అనసూయ ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం సెక్స్ రాకెట్ డొంక కదిలింది. ఆమె ఇచ్చిన సమాచారంతో సిరిసిల్ల తంగళ్ళపల్లి కి చెందిన కంసాని శ్రీనివాస్ తో పాటు కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా భాస్కర్, చందా కార్తీక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ కు చెందిన కంసాని లక్ష్మీలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక యాదగిరి పల్లికి చెందిన కంసాని ప్రవీణ్, హుస్నాబాద్ కి చెందిన కంసాని స్వప్న, అశోక్ కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Published at : 30 Jan 2023 01:32 PM (IST) Tags: Crime News Telangana News Human trading Kothhagudem Crime News Brothel Houses

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌