By: ABP Desam | Updated at : 30 Jul 2021 11:18 AM (IST)
కొండాపూర్‌లో హత్య కేసును ఛేదించిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే దానికి కారణమని తేల్చారు. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వరుసకు బావ అయ్యే వ్యక్తితో కలిసి భార్య తన భర్తను హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య కోసం ఉపయోగించిన ఆటోతో సహా రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
సంగారెడ్డి పోలీసులు వెల్లడించిన వివరాలివి.. మల్కాపూర్‌కు చెందిన నాటుకారి రామలింగం(34) అనే వ్యక్తి ఈ నెల 26న హత్యకు గురయ్యాడు. అతడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకోసం సీఐ, ఎస్సైలు ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడ్డారు. చనిపోయిన వ్యక్తి ఫోన్ కాల్ డేటా ఆధారంగా విస్తుగొలొపే విషయాలను పోలీసులు కనుగొన్నారు.
నాటుకారి రామలింగం భార్య అనిత. ఈమెకు బావ వరుసయ్యే భాస్కర్‌తో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ విషయంపై భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే రామలింగం కొద్ది రోజుల క్రితం భార్యతో గొడవపడి సంగారెడ్డి జిల్లా కల్పగూర్‌లో ఉంటున్న తన సొంత ఇంటికి వెళ్లాడు. అదే సయమంలో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు అనిత, భాస్కర్ నిర్ణయించుకొని ఈ నెల 26న రాత్రి అనిత భర్త రామలింగాన్ని నమ్మించి భాస్కర్ ఆటోలో మల్కాపూర్ శివారుకు తీసుకొచ్చారు. అక్కడ అతనికి ఫూటుగా మద్యం తాగించి అర్ధరాత్రి దాటిన తరువాత రాయితో కొట్టి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ కేసును కేవలం 48 గంటల్లో ఛేదించిన సీఐ లక్ష్మారెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్ సహా పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మల్కాపూర్‌కు చెందిన నాటుకారి రామలింగం 14 ఏళ్ల క్రితం సంగారెడ్డి మండలం కల్పగూర్‌కు చెందిన అనితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ భార్య వివాహేతర సంబంధం అతడి హత్యకు దారి చేసింది.
Also Read: KCR Politics: ఆ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం.. అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి
Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!
Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?