అన్వేషించండి

Konaseema News: ప్రియుడి టార్చర్‌ భరించలేక అన్నతో కలిసి అంతం! ఎట్టకేలకు వీడిన మిస్టరీ

AP Crime News: మ‌ల్కిపురంలో యువ‌కుని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడింది. స‌హ‌జీవ‌నంలో త‌న‌ను టార్చ‌ర్ పెడుతున్నాడ‌న్న కార‌ణంతో అన్న‌, అత‌ని ఫ్రెండ్ తో క‌లిసి స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

Konaseema Crime News: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఆరు నెలలుగా ప్రేమలో మునిగి తేలారు.. చివరకు దూరంగా వెళ్లిపోయి సహజీవనం సాగించారు.. సీన్‌ కట్‌ చేస్తే అతడి టార్చర్‌ భరించలేని స్థితిలో తిరిగి ఇంటి బాటపట్టింది.. జరిగిన విషయం అన్నకు చెప్పిందా యువతి.. పగతో రగలిపోయిన అన్న, అతని స్నేహితులతో కలిసి స్కెచ్‌ వేసి కొట్టి చంపి గొదాట్లోకి తోసేశారు.. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది.. యువకుని అనుమానస్పద మృతి కేసు మిస్టరీ వీడింది.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పరిధిలోని మల్కిపురంలో తన కుమారుడు పడమటి నోయల్‌ జార్జ్‌ కనిపిండం లేదంటూ గుడిమెల్లంక ప్రాంతానికి చెందిన పడమటి రత్నంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల తరువాత సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం వద్ద నోయల్‌ జార్జ్‌ మృతదేహం లభ్యమయ్యింది.. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. మృతుని సెల్‌ఫోన్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతనికి చివరిగా వచ్చిన ఫోన్‌ కాల్‌ ఆధారంగా కేసులో మరింత లోతుకు వెళ్లారు. ఈ ఆధారంతోపాటు మృతుని తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు గుడిమెళ్లంక ప్రాంతానికి చెందిన రాపాక ప్రశాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా మర్డర్‌ వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది

గంజాయి తాగమని హింసించేవాడు...

కాకినాడలో ప్రశాంతి, నోయల్‌ జార్జ్‌ ఇద్దరూ కలిసి సహజీవనం సాగించేవారు.. ఈ క్రమంలోనే నోయల్‌ జార్జ్‌ మద్యానికి బాగా బానిసై ప్రశాంతిని వేధింపులకు గురిచేసేవాడు.. అంతేకాకుండా సిగరెట్లు, గంజాయికూడా సేవించి తనతోపాటు ప్రశాంతిని కూడా తాగమని ఇబ్బంది పెట్టి మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేవాడు. దీంతో ప్రశాంతి ఈ బాధలు తట్టుకోలేక ఈనెల 9న కాకినాడ నుంచి ఇళ్ల అన్నయ్య రాపాక ప్రకాష్‌ వద్దకు మలికిపురం వచ్చేసింది. కాకినాడలో నోయల్‌ జార్జ్‌ తనను ఏవిధంగా హింసించేవాడో అన్నయ్య రాపాక ప్రకాష్‌కు తెలిపింది.దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ప్రకాష్‌ రాజోలుకు చెందిన తన స్నేహితుడైన యర్రంశెట్టి ప్రేమ్‌కుమార్‌ తో విషయం చర్చించి రాపాక ప్రశాంతి ముగ్గురూ కలిసి నోయల్‌ జార్జ్‌ను మట్టుపెట్టాలని పథక రచన చేశారు..

రమ్మని పిలిచి చంపేశారు
తన చెల్లిని హింసించిన నోయల్‌ జార్జ్‌ను అంతమొందించాలని పథక రచన చేసిన ప్రకాష్‌.. ప్రశాంతి చేత దిండి`చించినాడ బ్రిడ్జి వద్దకు రావాలని ఫోన్‌ చేయించారు. అతను అక్కడకు రావడంతో ముందు అనుకున్న ప్రకారం ఇనుపరాడ్లుతో నోయల్‌ జార్జిని కొట్టి చంపి గోదావరిలో పడవేశారు. నోయల్‌ వేసుకొచ్చిన బండిని బ్రిడ్జి వద్ద పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈక్రమంలోనే తన కుమారుడి బైక్‌ చించినాడ బ్రిడ్జిపై బండి ఉందని సమాచారం తెలుసుకున్న తండ్రి రత్నంరాజు మలికిపురం పోలీసులకు తనకుమారుడు అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 13న నోయల్‌ మృతదేహం అంతర్వేది పల్లిపాలెం వద్ద నదీసాగర సంగమం వద్ద లభ్యమయ్యింది. దర్యాప్తులో భాగంగా నోయల్‌ జార్జితో సహజీవనం చేసిన ప్రశాంతిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు హత్యోదంతం బహిర్గతం అయ్యింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించింది.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget