News
News
X

Konaseema Crime: మైనర్ బాలికతో పెళ్లి, ఫస్ట్ నైట్ ఏకాంత చిత్రాలు వాట్సాప్ లో పెట్టి భర్త రాక్షసానందం!

భర్తే ఇకపై నీకు సర్వస్వం అని మూడుముళ్ల బంధంతో తమ కుమార్తెను అప్పగించిన తల్లితండ్రులకు ఆ అల్లుడు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఫస్ట్ నైట్ రోజు తన భార్యతో గడిపిన ఏకాంత చిత్రాలను స్నేహితులకు షేర్ చేశాడు.

FOLLOW US: 
Share:

Konaseema Crime News Husband arrested for sharing personal videos:  
ఇటీవల ఓ మైనర్ బాలికపై అయిదుగురు సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన మరువక ముందే అదే మండలంలో మరో అమానవీయ సంఘటన వెలుగు చూసింది. భర్తే ఇకపై నీకు సర్వస్వం అని చెప్పి మూడుముళ్ల బంధంతో తమ కుమార్తెను అప్పగించిన తల్లితండ్రులకు ఆ అల్లుడు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఫస్ట్ నైట్ రోజు తన భార్యతో గడిపిన ఏకాంత చిత్రాలను సెల్ ఫోన్ లో తీసి వాట్సాప్ లో తన స్నేహితులకు పంపి రాక్షసానందం పొందాడు. పెళ్లి వయస్సు రాకపోయినా తమ కుమార్తెకు మంచి సంబంధం వచ్చిందని భావించి మైనర్ బాలికకు వివాహం చేసిన తల్లి తండ్రులు ఈ ఊహించని పరిణామంతో కంగుతిని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. 
అసలేం జరిగిందంటే..
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Dr BR Ambedkar Konaseema District)లోని కాట్రేనికోన మండల పరిధిలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మైనర్ బాలికకు తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే తొలి రాత్రి గడుపుతుండగా అశ్లీల చిత్రాలను తీసి వాట్సాప్ ద్వారా ప్రచారం చేసిన భర్తను అరెస్ట్ చేసినట్లు కాట్రేనికోన ఎస్సై టి. శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామానికి చెందిన మైనర్ బాలిక (Child Marriage With Minor Girl)ను మల్లాడి వీరబాబు ఈ ఏడాది ఫిబ్రవరి 8న వివాహం చేసుకున్నాడు. 

కీచక భర్తకు 14 రోజులు రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
మొదటి రాత్రి ఆమెతో ఏకాంతంగా గడిపిన చిత్రాలను భర్త తన సెల్ ఫోన్ లో తీసుకున్నాడు. భర్త వాటిని వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపి ప్రచారం చేశాడు. ఇది కాస్తా బయట పడడంతో బాలిక కుటుంబానికి తెలిసింది. దాంతో అల్లుడి నిర్వాకంపై ఫిబ్రవరి 20న బాధితురాలి తల్లి కాట్రేనికోన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముమ్మిడివరం సీఐ ఎం.జానకిరామ్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 28న నిందితుడు మల్లాడి వీరబాబు అరెస్ట్ చేసి బుధవారం ముమ్మిడివరం కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. 

మైనర్ బాలికకు వివాహం చేయడంపై చర్యలు...
వివాహ వయసురాని మైనర్ బాలికను పెళ్లి చేసి ఆమె జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టిన క్రమంలో పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు బాల్య వివాహంపై విచారణలో భాగంగా పోలీసులు ఇరువురి తల్లిదండ్రులు, వివాహం చేసిన పాస్టర్, గ్రామ పెద్దల వివరాలు సేకరిస్తున్నారు. మైనర్ బాలికకు వివాహం చేసిన ఘటనలో ఉన్న వారందరిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. భార్యతో ఏకాంతంగా గడుపుతూ ఆ తతంగాన్ని ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్ లో స్నేహితులకు పంపడంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాల్య వివాహాలు చేయడం నేరమని తెలిసి ఇంకా కొందరు తల్లిదండ్రులు ఈ పని చేయడాన్ని పోలీసులు తప్పుపట్టారు. అమ్మాయి జీవితం నాశనం అవుతుందని, కనుక మేజర్ అయ్యాకే వారికి వివాహం చేయడం ఉత్తమమని సూచించారు.

Published at : 01 Mar 2023 11:56 PM (IST) Tags: Crime News Child Marriage Konaseema District BR Ambedkar Konaseema District Minor Girl

సంబంధిత కథనాలు

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

Guntur Crime News: మాకు చెప్పకుండా జనాల్ని తీసుకెళ్తారా ? వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కానిస్టేబుల్!

Guntur Crime News: మాకు చెప్పకుండా జనాల్ని తీసుకెళ్తారా ? వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కానిస్టేబుల్!

Social Media posts Arrests : రాజకీయ నేతల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తే జైలే - మీమర్స్‌కు షాకిచ్చిన సైబర్ క్రైమ్స్ పోలీసులు !

Social Media posts Arrests :  రాజకీయ నేతల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తే జైలే - మీమర్స్‌కు షాకిచ్చిన సైబర్ క్రైమ్స్ పోలీసులు !

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Mulugu News: నీళ్లు తాగిన వెంటనే 24 మంది కూలీలకు అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం

Mulugu News: నీళ్లు తాగిన వెంటనే 24 మంది కూలీలకు అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!