News
News
X

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ సంచలనం అయింది. వ్యాపారస్తుల మధ్య లావాదేవీల్లో వివాదాల వల్లే కిడ్నాప్ చేశారని వ్యాపారి బంధువులు ఆరోపించారు.

FOLLOW US: 
Share:

 Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. మిర్చీ యార్డు నుంచి బైక్ పై వస్తున్న వ్యాపారిని చితకబాది ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లినట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు. వ్యాపారస్తుల మధ్య లావాదేవీల్లో భాగంగా కిడ్నాప్ జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ కలకలంతో పోలీసులు రంగంలోకి దిగారు. వ్యాపారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.

అసలేం జరిగింది? 

గుంటూరు నగరానికి చెందిన మిర్చీ వ్యాపారులు నరేంద్ర కుమార్, బర్మా వెంకట్రావుల మధ్య గత కొన్నేళ్లుగా లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నాయి. నరేంద్ర తనకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని బర్మా వెంకట్రావు ఆరోపిస్తున్నారు. నరేంద్రకు మిర్చిని విక్రయించానని వాటి తాలూకా తనకు డబ్బులు రావాలని వెంకట్రావు వాదన. దీనిపై పోలీస్ స్టేషన్లలో నరేంద్ర ఫిర్యాదు కూడా చేశాడు. మరోవైపు వెంకట్రావు వద్ద నుంచి డబ్బులు రావాల్సిన మిర్చీ రైతులు కూడా పోలీసులకు కంప్లయింట్ చేశారు. వెంకట్రావు మాత్రం తనకు నరేంద్ర డబ్బులివ్వాలని అవి రాగానే చెల్లిస్తానంటూ చెబుతూ వచ్చాడు.  ఇదే విషయం మిర్చీ యార్డులోని పెద్దల వద్ద కూడా పంచాయితీ జరిగింది. ఎన్ని చోట్లకు వెళ్లిన ఇద్దరి మద్య ఉన్న సమస్య పరిష్కారం కాలేదు. 

ఇన్నోవా కారులో వచ్చి కిడ్నాప్ 

ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో మిర్చి యార్డు నుంచి బైకుపై వస్తున్న నరేంద్రను ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు దుండగులు అడ్డుకున్నారు.  నలుగురు దుండగులు నరేంద్రను కొట్టి  ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన బంధువులు హుటాహుటిన యార్డు వద్దకు వచ్చారు. మిర్చి యార్డు నుంచి కిలో మీటర్ దూరంలోనే కిడ్నాప్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే వ్యాపారులు మిర్చి యార్డు వద్ద ఆందోళనకు దిగారు. వ్యాపారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిందుతుల వద్ద నుంచి వ్యాపారిని క్షేమంగా కాపాడాలని డిమాండ్ చేశారు. మిర్చి యార్డు నుండి వస్తున్న తన తండ్రిని కిడ్నాప్ చేసినట్లు నరేంద్ర కొడుకు చైతన్య పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కిడ్నాపర్లను పట్టుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. 

అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్

అద్దె ఇంటి కోసం తిరుగుతున్నట్లు నటించిన యువకుడు చైన్ చోరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగింది. అద్దె ఇంటి కోసం వెతుకున్నట్లుగా వచ్చి చైన్ స్నాచింగ్ చేసిన ఘటన నిజాంపేట్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల సీసీ ఫుటేజీ సేకరించారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేశామన్నారు. అయితే ఒంటరి మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 

అసలేం జరిగిందంటే..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి పియస్ పరిధి నిజాంపేట్ లో శ్రీనివాస్ కాలనీకి చెందిన స్వర్ణలత(62) స్థానికంగా గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఓ వ్యక్తి ఆమెకు ఎదురుపడి అద్దె ఇంటి విషయమై చర్చించాడు. దాంతో ఆ మహిళ ఇల్లు అద్దెకు లేదని చెప్పినా వినకుండా ఆమెను ఫాలో అవుతూ ఇంటివరకు వచ్చాడు నిందితుడు. ఆ పెద్దావిడ తాను నివాసం ఉంటున్న బాలాజీ రెసిడెన్సీలోని లిఫ్ట్ లోపలికి రాగానే వెంటనే నిందితుడు లిఫ్ట్ గ్రిల్ ఓపెన్ చేసి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.

Published at : 01 Feb 2023 07:41 PM (IST) Tags: AP News Crime News Kidnap Guntur Mirchi Trader

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak SIT : గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127, 122 మార్కులు- మరో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్టు!

TSPSC Paper Leak SIT : గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127, 122 మార్కులు- మరో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్టు!

Kakinada Crime : గ్రామ దేవత జాతరలో కాలు తొక్కాడని గొడవ, ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి!

Kakinada Crime : గ్రామ దేవత జాతరలో కాలు తొక్కాడని గొడవ, ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి!

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Honour Killing Chittoor: ఇష్టం లేకుండా కుమార్తెను పెళ్లి చేసుకున్న అల్లుడిపై మామ పగ- నడిరోడ్డుపై కిరాతకంగా హత్య

Honour Killing Chittoor: ఇష్టం లేకుండా కుమార్తెను పెళ్లి చేసుకున్న అల్లుడిపై మామ పగ- నడిరోడ్డుపై కిరాతకంగా హత్య

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

టాప్ స్టోరీస్

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

TSPSC Exams :  రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ