News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana: నీలోఫర్ హాస్పిటల్ లో బాలుడి కిడ్నాప్ సుఖాంతం, పెంచుకుందామనే ఎత్తుకెళ్లారట

నీలోఫర్ హాస్పిటల్ లో బాలుడు కిడ్నాప్ సుఖాంతమైంది.

FOLLOW US: 
Share:

హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ హాస్పిటల్ లో బాలుడు కిడ్నాప్ సుఖాంతమైంది. టాస్క్ ఫోర్స్  పోలీసులు తీవ్రంగా శ్రమించి ఈ కేసును ఛేదించారు. నిందితులను నిజామాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డిసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... కామారెడ్డి జిల్లా బాన్సువాడ కు చెందిన మమతకు ఇదివరకే ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. దీంతో ఓ బిడ్డను ఎత్తుకెళ్లి అయిన పెంచుకోవాలని మమత, ఆమె భర్త నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తమ కుమారుడి ఆరోగ్యం బాగోలేదంటూ నీలోఫర్ హాస్పిటల్ లో చేరారు.  అక్కడ ఎవరి బిడ్డను అయిన అతని చూసి ఎత్తుకెళ్లాలని పథకం వేశారు. 

ఆస్పత్రిలో పరిచయం పెంచుకుంటూ....
హాస్పిటల్లో చేరిన వాళ్లతో మమత, ఆమె భర్త పరిచయాలు పెంచుకుంటూ... పైసల్ ఖాన్ అనే చిన్నారి మీద కన్ను వేశారు. నాలుగు రోజుల కిందట పైసల్ ఖాన్ తల్లి భోజనం తేవడానికి బయటకు వెళ్ళింది. ఇదే అనువైన సమయం అనుకొని బిడ్డను తీసుకొని పరారయ్యారు. ఈ కిడ్నాపింగ్ వ్యవహారంలో వీరిద్దరికీ మరో జంట సహాయం చేశారు. బిడ్డ కనిపించకపోయేసరికి పైసల్ ఖాన్ తల్లి ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. హాస్పిటల్ సిబ్బందితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్పిటల్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కిడ్నాపర్లను పట్టుకోవడం కొంతమేర పోలీసులకు కష్టతరంగా మారింది. చివరకు హాస్పిటల్ సమీపంలోనే ఉన్న సీసీ ఫుటేజీల ద్వారా కేసును ఛేదించారు. జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ నుంచి నిజామాబాద్, కామారెడ్డి వైపు కిడ్నాపర్లు ప్రయాణించారు. చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ జంటను పట్టుకొని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు.

అందుకే నీలోఫర్లో ఓ పక్క కొడుకు చికిత్స తీసుకుంటుండగానే... ప్లాన్ ప్రకారం పైసల్ ఖాన్ ను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. ఈ జంట బాన్సువాడ టౌన్ లో కిరాయికి ఇల్లు తీసుకొని ఆ ఎత్తుకొచ్చిన బిడ్డతో ఉన్నారని వెల్లడించారు. నిలోఫర్ హాస్పిటల్ నుండి జూబ్లీహిల్స్ బస్టాండ్ వరకు పోలీసులు సుమారు 100 సీసీ కెమెరాలల్లో జల్లెడ పట్టి కేసును ఛేదించారు. ఆ బిడ్డ నన్ను చూసి నవ్వాడు అందుకే పెంచుకుందామని ఎత్తుకెళ్లాం అని పైసల్ ఖాన్ కిడ్నాప్ గురించి మమత వెల్లడించింది. ఎత్తుకెళ్లిన బాలుడికి రెండు రోజులు నిందితురాలు మమతనే పాలు ఇచ్చినట్లు సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు వెల్లడించారు.  

పోలీసులను అభినందించిన డీసీపీ.....
నిలోఫర్ హాస్పిటల్లో కిడ్నాప్ అయిన బాలుడి కేసును ఛేదించిన పోలీసులను సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు అభినందించారు. బాలుడు కిడ్నాప్ గురైన నుంచి చాలా చాకచక్యంగా పోలీసులు వ్యవహరించాలని తెలిపారు. హాస్పిటల్ లో సీసీ కెమెరాలు పనిచేయకున్నా గాని వేరే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టారని వెల్లడించారు. కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసులకు డీసీపీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. 

Published at : 20 Sep 2023 05:26 PM (IST) Tags: Kidnap Nilofar Hospital

ఇవి కూడా చూడండి

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Crime News: కాపీ కొట్టావని నిందించిన టీచర్‌- మనస్తాపంతో విద్యార్థిని ఏం చేసిందంటే?

Crime News: కాపీ కొట్టావని నిందించిన టీచర్‌- మనస్తాపంతో విద్యార్థిని ఏం చేసిందంటే?

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు