By: ABP Desam | Updated at : 04 Jul 2022 01:31 PM (IST)
పెట్రోల్ కొట్టించగానే బైక్ నుంచి మంటలు
Khammam Bike Fire Accident: వేసవికాలంలో అయితే పెట్రోల్, డీజిల్ ఇంధన వాహనాలలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ఎలక్ట్రిక్ బైక్స్ లాంటి వాహనాలు సైతం అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ప్రస్తుతం సీజన్ మారినా పరిస్థితులు మాత్రం మారలేదు. పెట్రోల్ కొట్టించగానే ఓ బైక్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. అసలే పెట్రోల్ బంకులో బైక్ అగ్ని ప్రమాదానికి గురవడంతో బంక్ మేనేజ్‌మెంట్ సిబ్బందితో పాటు పెట్రోల్ కోసం బంక్ లో ఆగిన వాహనదారులు గుండె గుబేల్ మంది. ఇద్దరు యువకులు చాకచక్యంగా వ్యవహించడంతో పెట్రోల్ బంక్‌లో పెద్ద ప్రమాదం తప్పింది.
అసలేం జరిగిందంటే..
Bike catches fire at Petrol Bunk in Khammam District: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని హిందూస్తాన్ పెట్రోలియం పెట్రోల్ బంక్‌కు ఓ వాహనదారుడు పెట్రోల్ కోసం వెళ్లాడు. బంక్ సిబ్బంది బైకులో పెట్రోల్ లోడ్ చేయగానే ఉన్నట్టుండి ఆ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. కొందరు వాహనదారులు అది గమనించి ప్రాణ భయంతో బంక్ నుంచి దూరంగా పరుగులు పెట్టారు. అయితే వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది మంటల్ని ఆర్పే సాధనంతో బైక్ కు అంటుకున్న మంటల్ని అదుపులోకి తెచ్చారు.
అనంతరం బైక్‌ను బంక్ నుంచి బయటకు లాగి రోడ్డు మీద మరోసారి మంటలు రాకుండా పూర్తిగా అదుపులోకి తేవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తెచ్చిన యువకుల్ని స్థానికులు ప్రశంసించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
హైదరాబాద్‌లో కెమికల్ ట్యాంకర్..
నగరంలోని వనస్థలిపురం ఆటో నగర్ డీర్ పార్క్ వద్ద కెమికల్ ట్యాంకర్ అగ్ని ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ వైపు నుంచి ఆటో నగర్ వైపు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Also Read: Software Engineer Suicide: సాఫ్ట్‌వేర్ విషాదాలు- ఆన్‌లైన్ మోసానికి ఉద్యోగిని సూసైడ్, వ్యాయామం చేస్తూ మరొకరు మృతి
Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్
Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన