అన్వేషించండి

Karimnagar: కన్న తండ్రి ఇంట్లోనే కొడుకు భారీ చోరీ.. కాల్ రికార్డర్ యాప్‌ కీలక పాత్ర.. భార్యతో మాస్టర్ ప్లాన్

కరీంనగర్‌ పట్టణానికి చెందిన వైకుంఠం అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మొదటి, మూడో కొడుకులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండో కొడుకు కరీంనగర్‌లోనే వేరుగా ఉంటున్నాడు.

కరీంనగర్‌లో జరిగిన ఓ చోరీ ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది. దొంగతనం కేసులో విచారణ జరిపిన పోలీసులకు కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు తెలిశాయి. ఎంతటి పక్కా సమాచారంతో ఎంతో కాలంగా మాటు వేసి దొంగతనం చేశాడో తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ నేరం చేసినది కన్న కొడుకే అని పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనం కోసం నిందితుడు వాడిన సాంకేతికత అవాక్కయ్యేలా చేస్తోంది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ పట్టణానికి చెందిన వైకుంఠం అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మొదటి, మూడో కొడుకులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండో కొడుకు కరీంనగర్‌లోనే వేరుగా ఉంటున్నాడు. స్థిరాస్తులకు సంబంధించిన వైకుంఠానికి కొడుకులతో తరచూ గొడవలు ఉండేవి. ఇవి వివాదంగా మారడంతో తండ్రి వద్ద ఉన్న సొత్తును కాజేయాలని రెండో కొడుకు కుట్ర పన్నాడు. దీనికి అతడి భార్య కూడా సహకరించింది. వైకుంఠం ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? అనేవి మొత్తం తెలుసుకొనేందుకు రెండో కొడుకు ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌ అనే యాప్‌ను తండ్రి ఫోన్‌లో ఆయనకు తెలియకుండానే ఇన్‌స్టాల్ చేశాడు.

Also Read: Hyderabad: తల్లిపైనే నీచానికి పాల్పడిన కన్న కూతురు.. ప్రియుడి సాయం తీసుకొని దారుణం

ఈ యాప్ సాయంతో తండ్రి మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ మొత్తం ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా రెండో కొడుక్కి వస్తుండేవి. ఇలా తన ఈ-మెయిల్‌‌కి వస్తున్న ప్రతి కాల్‌ను రెండో కుమారుడు వినేవాడు. వైకుంఠం ఇటీవల హైదరాబాద్‌లోని మొదటి, రెండో కొడుకుల వద్దకు రావాలని భావించి.. ఈ విషయం వారికి ఫోన్‌లో చెప్పారు. వాళ్లు ఇంటికి తాళాలు సరిగ్గా వేయాలని, వాటిని భద్రంగా ఉంచుకోవాలని సూచించగా.. వైకుంఠం ఆ తాళాలను ఫలానా రహస్య ప్రాంతంలో దాచి వస్తానంటూ చెప్పేశాడు. 

Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్ 

ఈ సంభాషణ మొత్తం ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డర్‌ యాప్‌ ద్వారా రికార్డు కావడంతో పాటు రెండో కుమారుడు మొత్తం విన్నాడు. అలా విషయం తెలుసుకున్న రెండో కొడుకు భార్యతో కలిసి తండ్రి ఇంటికి వెళ్లాడు. రహస్య ప్రాంతం నుంచి తాళాలు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తెరిచి అందులోని రూ.25 లక్షల విలువైన నగదు, నగలు కాజేశారు. ఆపై యథావిధిగా తాళాలు వేసి ఆ రహస్య ప్రాంతంలోనే పెట్టేశారు. భార్యతో కలిసి హైదరాబాద్‌ వచ్చిన వైకుంఠం కొన్ని రోజులకు కరీంనగర్‌ తిరిగి వెళ్లారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా.. బీరువాలో ఉండాల్సిన డబ్బు, బంగారం మొత్తం మాయమై ఉంది. ఆస్తి పత్రాలు కూడా కనిపించలేదు.

Also Read: Nellore Crime: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!

విషయం పోలీసులకు చెప్పడంతో వారు విచారణ జరిపారు. తన ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను నిశితంగా గమనించగా.. ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌ యాప్‌ ఉండటాన్ని గుర్తించారు. దాన్ని తెరిచి అధ్యయనం చేయగా.. రెండో కుమారుడి ఈ– మెయిల్‌ ఐడీతో సింక్ అయి ఉన్నట్లు గుర్తించారు. తన సంభాషణలు విన్న రెండో కుమారుడే ఈ దొంగతనం చేసి ఉంటాడని నిర్ధారించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : ఆర్కేకు లాల్ సలాం ! అంత్యక్రియల ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Hyderabad Crime: 'దిశ' ఘటన ప్రదేశంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!
'దిశ' ఘటన ప్రదేశంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget