అన్వేషించండి

Karimnagar Gun Fire : కరీంనగర్ జిల్లాలో కాల్పుల కలకలం, రౌడీషీటర్ పై గన్ ఫైర్, కుటుంబ సభ్యులపై దాడి!

Karimnagar Gun Fire : కరీంనగర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. అరుణ్ అనే రౌడీషీటర్ పై మరో నలుగురు రౌడీషీటర్లు గన్ తో కాల్పులు జరిపారు.

Karimnagar Gun Fire :  కరీంనగర్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి అరుణ్ అనే రౌడీషీటర్ పై నలుగురు వ్యక్తులు గన్ తో దాడికి పాల్పడ్డారు. గన్ మిస్ ఫైర్ అవ్వడంతో అరుణ్ తప్పించుకున్నాడు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు నిందితులను మానకొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.  అరుణ్ పై దాడి చేసిన వ్యక్తులపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

అసలేం జరిగింది? 

కరీంనగర్‌ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం సృష్టించాయి. నలుగురు రౌడీలు మరో రౌడీషీటర్‌పై గన్ తో కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాషబోయిన అరుణ్‌ అనే రౌడీషీటర్‌పై మరో ఇద్దరు వ్యక్తులు... అరుణ్ ఇంట్లోనే దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. తపంచాతో కాల్పులకు దిగారు. అయితే గురి తప్పడంతో అరుణ్‌ ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి పారిపోయాడు. అరుణ్ ఎక్కడికి పారిపోయాడో చెప్పాలని కుటుంబ సభ్యులపై దాడికి దిగారు దుండగులు. అరుణ్ ఇంటిని ధ్వంసం చేశారు. అరుణ్‌ ఎక్కడున్నాడో చెప్పాలని కుటుంబ సభ్యులను గన్ తో బెదిరించి దాడి చేశారు. స్థానికులు స్పందించి  అరుణ్‌ కుటుంబ సభ్యులను కాపాడారు. ఇద్దరు రౌడీలను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల్లో ఒకరు యాదాద్రి జిల్లాకు చెందిన పాల మల్లేష, మానుకొండూరుకు చెందిన బైరగోని మధు అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

గన్ తో బెదిరించి ఖతం చేస్తామన్నారు- స్థానికులు

"గొడవ జరిగినప్పుడు మేం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చాం. ఎవరైనా దగ్గర వస్తే ఖతం చేస్తామని గన్ పెట్టి బెదిరించారు. ఎవరూ దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. రౌడీల్లా ఉన్నారు. మొత్తం నలుగురు వచ్చారు. మద్యం మత్తులో నలుగురు వ్యక్తులు అరుణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అరుణ్ వాళ్ల నుంచి తప్పించుకుని పక్కింట్లో తలదాచుకుంటే వాళ్లపై కూడా దాడి చేశారు. దాడి చేసిన వాళ్లను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాం"- స్థానికులు

పొరపాటు డోర్‌బెల్‌ మోగించాడని నల్లజాతి యువకుడిపై కాల్పులు

అమెరికాలోని మిస్సౌరీలో దారుణం 85 ఏళ్ల శ్వేతజాతీయుడు 16 ఏళ్ల నల్లజాతీయుడిని తుపాకీతో కాల్చేశాడు. ప్రస్తుతం ఆ కుర్రాడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంటి డోర్‌బెల్‌ను పొరపాటున మోగించడమే ఆ కుర్రాడికి శాపమైంది.  16 ఏళ్ల రాల్ఫ్ పాల్ యార్ల్ తన సోదరుడిని తీసుకురావడానికి  స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఇంటికి అడ్రెస్ సరిగా తెలియకపోవడంతో పొరపాటున వేరే వాళ్ల ఇంటి డోర్‌బెల్‌ను మోగించాడు. ఆ ఇంటి నుంచి 85 ఏళ్ల వ్యక్తి బయటకు వచ్చాడు. వివరాలు అడిగి తెలుసుకుని తప్పుగా బెల్ మోగించాడని తన చేతిలో తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు.  శ్వేతజాతీయుడు జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాల్ఫ్ పాల్ యార్ల్ పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. ఈ కేసులో అరెస్టైన వ్యక్తి 24 గంటల్లోనే బెయిల్‌పై విడుదల కావడం నల్లజాతీయుల ఆగ్రహానికి కారణమైంది.  

85 ఏళ్ల ఆండ్రూ లెస్టర్ రెండు నేరాలకు పాల్పడినట్టు క్లే కౌంటీ ప్రాసిక్యూటర్ జాకరీ థాంప్సన్ తేల్చారు. యార్ల్‌ను కాల్చడం ఒక నేరమైతే.. అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండటం మరో నేరంగా పరిగణిస్తున్నారు. అయితే $200,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.   ఆండ్రూ లెస్టర్ కాల్పుల్లో గాయపడ్డ యార్ల్‌ చాలా తెలివైన కుర్రాడిగా బాలుడి మేనత్త ఫెయిల్‌ స్పూన్‌మూర్ చెప్పారు. గోఫండ్‌మి క్యాంపెయిన్‌లో మాట్లాడిన ఆమె... కెమికల్ ఇంజనీరింగ్‌ చదవాలని ఆ కుర్రాడు కలలు కన్నట్టు వివరించారు.  ఓ నల్లజాతీయుడిపై శ్వేతజాతీయుడు కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వైట్‌హౌస్‌ కూడా ఈ ఘటనపై స్పందించాల్సి వచ్చింది. అధ్యక్షుడు జో బిడెన్ యార్ల్‌తో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు వైట్ హౌస్ సోమవారం సాయంత్రం ప్రకటించింది "త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షించినట్టు తెలిపింది."

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget