By: ABP Desam | Updated at : 07 Feb 2022 09:57 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరీంనగర్ లో ఓ కుటుంబం ఆత్మహత్య
ఎంతో ఆనందంగా ఉండే కుటుంబాన్ని కరోనా కష్టాలు పాలుచేసింది. కుమారుడికి కొత్తగా వచ్చిన ఉద్యోగం కరోనా కారణంగా పోయింది. ఆడ పిల్లల పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక సమస్యలతో అనుకొని నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కరీంగనర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు. మృతులు బైరి శంకరయ్య (55), జమున(50), శ్రీధర్ గా పోలీసులు గుర్తించారు. అయితే అప్పుల బాధతోనే కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కొడుకు జాబ్ లో జాయిన్ అయిన సమయంలోనే కరోనా రావడంతో ఆడపిల్లల పెళ్లికోసం చేసిన అప్పులు పెరిగి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయని తరచూ చెప్పేవాడని, కానీ ఇంత అఘాయిత్యానికి పాల్పడతారని ఊహించలేదని స్థానికులు అంటున్నారు. మూడు నెలల క్రితం శంకరయ్య కుమార్తె వివాహం చేశాడు. దీనితో అప్పులు పెరిగాయని, ఎలా తీర్చాలో తెలియక అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అంటున్నారు. ఇంటి బయట తాళం వేసి మరో మార్గం ద్వారా లోనికి ప్రవేశించి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
తొందరపాటు నిర్ణయంతో నవ దంపతులు ఆత్మహత్య
చాలా ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నలభై రోజుల్లోనే బలవన్మరణాలకు పాల్పడేలా చేసింది. బంధుమిత్రులకు తీవ్ర విషాదం మిగిల్చింది. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన పొదిలి శ్రీమన్నారాయణ, రమణమ్మ దంపతుల కుమారుడు మహానంది(30). ఇతను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాయ్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ప్రియాంక(24)తో గత ఏడాది డిసెంబర్ 28న వివాహమైంది. సంక్రాంతి తర్వాత ప్రియాంకను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి విధులకు వెళ్లారు. ఇటీవల కానిస్టేబుళ్ల భర్తీ ప్రకటన విడుదల కావడంతో పరీక్షలకు సిద్ధం కావాలని మహానంది చరవాణిలో భార్యను కోరారు. ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని ప్రియాంక తెలిపింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు సంభాషణ సాగిందని ఇద్దరి తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 4న ప్రియాంక పుట్టింటిలో గాలిపంకాకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న మహానంది.. శనివారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి బస్సులో ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో ఒంగోలు వచ్చారు.
ఒంగోలు చేరుకున్న మహానంది తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేనని.. ఇక మీదట మీ దగ్గరకు రానని చెప్పారు. ఆందోళన చెందిన వారు అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం ఉదయం 5 గంటల సమయంలో వాసు అనే స్నేహితుడి చరవాణికి తాను గుండ్లకమ్మ జలాశయం దగ్గర ఉన్నానని చనిపోతున్నట్టు మహానంది సంక్షిప్త సందేశం పంపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హుటాహుటిన జలాశయం వద్దకు చేరుకున్నారు. ఒడ్డున మహానంది బ్యాగ్, బూట్లు, చరవాణి, గుర్తింపు కార్డులు, ఫొటోలు ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఒంగోలు, అద్దంకి అగ్నిమాపక సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని బోట్ల సహాయంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయంలో మహానంది మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల వ్యవధిలోనే నవ దంపతులు బలవన్మరణాలకు పాల్పడటంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
Uttarakhand Gang Rape : కదిలే కారులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం - ఉత్తరాఖండ్‌లో మరో నిర్భయ !
Cyber Crime : కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్ వచ్చిందా? కాల్ చేస్తే ఖాతా ఖాళీ!
Chittoor Ganja Smuggling : చిత్తూరు జిల్లాలో గంజాయి మత్తు, పోలీసుల కళ్లు గప్పి జోరుగా రవాణా!
Vikarabad News : 48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో సుపారీ హత్యకు ప్లాన్, సర్పంచ్ భర్త కుట్రను భగ్నం చేసిన పోలీసులు
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ