అన్వేషించండి

Kanjhawala Case: తల చీలిపోయింది, ఎముకలు విరిగిపోయాయి - కంజావాలా కేసులో యువతి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ సంచలనం

Kanjhawala Case: కంజావాలా కేసులో యువతి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Kanjhawala Case:

శరీరంపై 40 గాయాలు..

ఢిల్లీలోని కంజావాలా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి మృతిపై కుటుంబ సభ్యులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా నిందితులు చెప్పిన సమాధానాలనూ వెల్లడించారు. అసలు  ఆ యువతి తమ కార్‌కు చిక్కుకుని ఉందన్న సంగతే గుర్తించలేదని అంటున్నారు నిందితులు. ఇందులో నిజానిజాలు ఇంకా తేలకపోయినా...ఈ కేసు మాత్రం దేశ రాజధానిలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఇటీవలే యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు పోలీసులు. దీని ప్రకారం...ఆ యువతి అత్యంత దారుణంగా చనిపోయింది. తల చీలిపోయి...ఎముకలన్నీ విరిగిపోయాయని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. పక్కటెముకలు చీల్చుకుని బయటకు వచ్చేశాయని వైద్యులు వివరించారు. మౌలానా ఆజాద్ కాలేజ్‌కు చెందిన 
ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానెల్ యువతి డెడ్‌బాడీని పరిశీలించి...ఈ రిపోర్ట్‌ను వెలువరించింది. తల, వెన్నెముకతో పాటు ఊపిరి తిత్తులకూ బలమైన గాయాలైన కారణంగానే మృతి చెందినట్టు నిర్ధరించారు వైద్యులు. యాక్సిడెంట్‌ కారణంగా షాక్‌కు గురైందని, ఆ తరవాత తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఒంటిపైన మొత్తం 40 గాయాలైనట్టు గుర్తించారు. కార్‌ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల తలకు బలమైన గాయమైనట్టు చెప్పారు. అందులోనూ..దాదాపు 10 కిలోమీటర్లకు పైగా లాక్కుని వెళ్లడం వల్ల శరీరానికి గాయాలయ్యాయి. మెదడులో కొంత భాగం కనిపించకుండా పోయిందని షాకింగ్ విషయం  చెప్పారు వైద్యులు. అయితే...మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విధంగా లైంగికంగా వేధించారనడానికి శరీరంపై ఎలాంటి గుర్తులు లేవని వెల్లడించారు. 

స్కూటీపై ఇద్దరు..! 

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన కంఝవాలా కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. న్యూ ఇయర్ రాత్రి కారు ఢీకొని 12 కిలోమీటర్లు రహదారిపై ఈడ్చుకెళ్లిన యువతి ప్రమాద సమయంలో ఒంటరిగా లేదని తేలింది. ఆ యువతితోపాటు స్కూటీపై స్నేహితురాలు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. పోలీసులు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితురాలితోపాటు
కూర్చొన్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్టు గుర్తించారు. బాధితురాలు, ఆమె స్నేహితురాలు రాత్రి సమయంలో స్కూటీపై వెళుతున్నట్లు సిసిటివి ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఫుటేజ్‌లో బాధిత యువతి పింక్ టీ షర్టులో ఉండగా, ఆమె స్నేహితురాలు ఎరుపు టీ షర్టులో ఉన్నారు. బాధితురాలి స్నేహితురాలు స్కూటీ నడుపుతుండగా, ఆమె వెనుక కూర్చున్నారు. మధ్యలో ఓ చోట తాను నడుపుతానంటూ బాధిత యువతి. వద్దని స్నేహితురాలు వారిస్తూ... మాట్లాడుకుంటూ ఇద్దరూ వెళ్లారు. కాస్త దూరం వెళ్లాక... స్కూటీని బాధిత యువతికి ఇచ్చేసింది స్నేహితురాలు. అక్కడ నుంచి ఆమె స్కూటీని నడుపుకొని కొంత దూరం వెళ్లింది. స్నేహితురాలు వెనుక కూర్చొని ఉంది. ఇలా వెళ్తున్న క్రమంలోనే సుల్తాన్ పురి ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. 

Also Read: 2.5 నిమిషాల్లో 2757 కండోమ్స్‌ డెలివరి- ఎవరూ తగ్గలేదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Andhra Pradesh Pension Scheme: ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం- ఆరు దశల్లో వడపోత- గ్రామాల్లో అధికారుల సర్వే
ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం- ఆరు దశల్లో వడపోత- గ్రామాల్లో అధికారుల సర్వే
TDP Yanamala: తెలుగుదేశంలో యనమల లేఖ కలకలం - నేతల ఆగ్రహం - సీనియర్ నేతకు పార్టీపై కోపం ఎందుకు ?
తెలుగుదేశంలో యనమల లేఖ కలకలం - నేతల ఆగ్రహం - సీనియర్ నేతకు పార్టీపై కోపం ఎందుకు ?
Mahesh Babu: 'ముఫాస : ది లయన్ కింగ్'కి వాయిస్ ఓవర్... మహేష్ బాబు ఎందుకు చేశారో తెలుసా?
'ముఫాస : ది లయన్ కింగ్'కి వాయిస్ ఓవర్... మహేష్ బాబు ఎందుకు చేశారో తెలుసా?
Telangana Group 2 Exam Date: 'గ్రూపు-2' పరీక్షలకు లైన్ క్లియర్, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు
'గ్రూపు-2' పరీక్షలకు లైన్ క్లియర్, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు
Embed widget