By: ABP Desam | Updated at : 18 Jul 2022 04:18 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కామారెడ్డి జిల్లాలో మైనర్ పై లైంగిక దాడి
Kamareddy Crime : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు 16 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఓ కాలానికి చెందిన బాలిక (16) పై కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి మాయమాటలతో లోబర్చుకొని లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపారు. బాలిక తండ్రి కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
(నిందితుడు కిరణ్)
రెండేళ్లుగా లైంగిక దాడి
(కామారెడ్డి ఎస్హెచ్వో నరేశ్ )
మహిళ దారుణ హత్య
గుంటూరు జిల్లా పెదకాకానిలో మద్యం మత్తులో దారుణం జరిగింది. ఓ మహిళ దారుణమైన తరహాలో హత్యకు గురైంది. ఈ ఘటన పెదకాకాని శివారులోని యువజన నగర్ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన ఝూన్సీకి ఇద్దరు సంతానం ఉన్నారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు.. గత కొంత కాలం క్రితం ఝాన్సీ భర్త చనిపోయాడు. పెద్ద కుమార్తెకు కూడా భర్త చనిపోవడంతో పుట్టింట్లో తల్లి వద్దనే ఉంటూ ఉంది. అదే ప్రాంతానికి చెందిన రసూల్, సతీష్ బాబు తన కుమార్తెతో మాట్లాడుతున్నారని వారిని ఝాన్సీ అసభ్య పదజాలంతో కనిపించినప్పుడల్లా తిట్టేది. మద్యం అలవాటు ఉన్న ఆమెతో మంచిగా ఉన్నట్లు నటించిన రసూల్, సతీష్ ఆదివారం మద్యం తాగేందుకు ఆటోలో పెదకాకాని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్స్ వెనుక యువజన నగర్ సమీపంలో ఉన్న ప్లాట్లలోకి తీసుకొచ్చారు. ముగ్గురు మద్యం తాగారు. కారణం లేకుండా ఇంటివద్ద ఎందుకు తిడుతున్నావని నిలదీశారు.
ముగ్గురి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఝాన్సీని కర్రతో కొట్టి, బీరు బాటిళ్లతో విచక్షణా రహింతంగా పొడిచి పారిపోయారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఝాన్సీ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు
Madhya Pradesh Lightning : మధ్యప్రదేశ్ లో విషాదం, పిడుగుపాటుకు 9 మంది మృతి!
Nellore News : నెల్లూరు జిల్లాలో దారుణం, తల్లి, కూతురు అనుమానాస్పద మృతి, భర్త ఆత్మహత్య!
Chikoti Case : చికోటి కేసినో కేసులో నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు - అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ?
Karimnagar Crime : సినీఫక్కీలో కూతురినే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్