Kakinada Crime News: కాకినాడలో దారుణం - అంతా చూస్తుండగా నడిరోడ్డులో పోలీసుపై కత్తితో దాడి!
Kakinada Crime News: కొబ్బరి బోండాలు అమ్ముకునే ఓ వ్యక్తి మోటార్ వెహికల్ ఇన్స్ పెక్ర్ పై కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశాడు.
Kakinada Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో కొబ్బరి బోండాల వ్యాపారి... మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పై దాడికి పాల్పడ్డాడు. అంతా చూస్తుండగా.. నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్లుగా నరకడంతో.. అతడి శరీర భాగాలు అన్ని రోడ్డుపై పడిపోయాయి. ముఖ్యంగా కాళ్లు, చేతుల వేళ్లు, పేగులు బయటకు వచ్చాయి. రోడ్డంతా రక్తసిక్తమైంది.
అసలేం జరిగిందంటే..?
కాకినాడ నగరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వద్ద హత్యాయత్నం జరిగింది. కొబ్బరి బోండాల వ్యాపారి.. కొబ్బరి బోండాలు నరికే కత్తితో, నడిరోడ్డుపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శరీర భాగాలు (పేగులు,చేతి వేళ్లు) తెగి కింద పడ్డాయి. విషయం గుర్తించిన ఓ వ్యక్తి అతడిని ఆపే ప్రయత్నం చేయగా.. అతిడిపైకి కూడా కత్తి దూశాడు నిందితుడు. జనమంతా పోగవుతుండడంతో అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు వెళ్లిన వెంటనే స్థానికులంతా తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడుని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారాయి.
కాకినాడలోనే మైనర్ల బరితెగింపు
కాకినాడ నగరంలో పోలీసుల పహారా సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ట్రాఫిక్ ఆంక్షలు అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వన్ వే పద్దతిలోనే కాకినాడలో రోడ్లుపై వాహనాలు తిరుగుతుంటాయి. ఇటీవల కాలంలో మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువై ప్రమాదాలు జరుగుతుండడంతో పోలీసులు తనిఖీలను మరింత ఎక్కువ చేశారు. దీంతో కొందరు కుర్రాళ్లు పోలీసుల విస్తుపోయే స్కెచ్ ఒకటి వేశారు.
ట్రాఫిక్ అప్డేట్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కొందరిని అడ్మిన్లుగా చేశారు. దీంతో కాకినాడవ్యాప్తంగా 802 మంది సభ్యులుగా చేరిపోయారు. ఇందులో ఎక్కువగా మైనర్లే ఉన్నారు. ఈ గ్రూప్ సభ్యులు ఎవ్వరైనా పోలీసులు ఎక్కడ మాటు వేశారో వెంటనే గ్రూప్‌లో అప్డేట్ చేయడం, వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేయడం, వెంటనే అటువైపుగా వెళ్లేవారు అలెర్ట్ అయ్యి అక్కడ నుంచి వేరే మార్గంలో జారుకోవడం షరా మామూలు అయిపోయింది. అంతే కాదండోయ్ ఈ అప్ డేట్‌లో కూడా కాస్త కామెడీని పండిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు వేరే పేర్లు పెట్టి ఆ పేర్లతోనే అప్డేట్ ఇవ్వడం పోలీసులను గుర్తించారు.
నిబంధనలు అతిక్రమిస్తున్నారనే..
ఇటువంటి వాట్సాప్ గ్రూప్‌ల వల్ల సమాజానికి నష్టం ఏమీ కాదు కానీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లుకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. పోలీసుల తనిఖీలపై ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్ సభ్యులు సమాచారం అందిస్తున్నారని, అయితే గ్రూపులో ఉన్నవారిలో చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు లేవన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, అంతే కాకుండా రోడ్డు నిభందనలు ఉల్లంఘించడం వంటి పనులు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నందున వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి వాట్సాప్ గ్రూప్‌ను డిలీట్ చేయించడం జరిగిందని వెల్లడించారు.