News
News
X

Jagityala Accident: జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆటో-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి, 5గురికి గాయాలు

జగిత్యాల జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. ఆటో-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.

FOLLOW US: 

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మల్యాల మండలం రాజారం గ్రామ శివారులో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన వలస కూలీలుగా తెలుస్తోంది. 

డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణ కూలీలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా అయిదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం నూకపల్లి అర్బన్‌ కాలనిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో పని చేసే కూలీలు జగిత్యాలలో వంట సరుకులు కొనుగోళు చేసుకుని ఆటోలో బయలు దేరారు. రాజారం వద్ద  ఎదురుగా వస్తున్న బైక్ ను ఆటో ఢీకొనటంతో ఆటో పల్టీలు కొట్టింది.  బైక్‌పై ప్రయాణిస్తున్న బత్తిని సంజీవ్‌ అక్కడిక్కడే మృతి చెందనగా మధు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన సుధాకర్‌, గోపాల్‌ మృతి చెందారు. కూలీలు జితేంద్ర, సురేశ్‌, హర్షకుమార్‌, బీహిను గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం 

News Reels

కరీంనగర్ కమాన్ చౌరస్తాలో తెల్లవారుజామున ఓ కారు సృష్టించిన బీభత్సంలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. సీస కమ్మరి వృత్తి ద్వారా కత్తులు, గొడ్డళ్ళు తయారు చేసి విక్రయించుకునే వారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలో ఒక మహిళ చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారంతా నిరుపేద కుటుంబీకులు. ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయం పూట కమాన్ చౌరస్తా లో తయారుచేసిన వస్తువులు అమ్ముకుంటారు.  ఈ క్రమంలోనే రోడ్డు పక్కన కూర్చున్న వారి పైకి కారు వేగంగా దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు ఒక మహిళను ఢీ కొట్టి.. అనంతరం స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారుకు, స్తంభానికి మధ్య ఇరుక్కుపోయిన మహిళ అక్కడికక్కడే స్పాట్‌లోనే చనిపోయింది. దాదాపు ఈ ఘటనలో 9 మందికి గాయాలు కాగా వీరిలో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆసుపత్రిలో చనిపోయారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు కారులో ఉన్న వాళ్ళు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

Also Read: కరీంనగర్ ఘోర ప్రమాదం మైనర్ల పనే... నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

Published at : 30 Jan 2022 08:39 PM (IST) Tags: TS News Jagityala road accident auto bike dashed three died in accident

సంబంధిత కథనాలు

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

TSRTC MD Sajjanar: డ్రైవర్‌ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన

TSRTC MD Sajjanar: డ్రైవర్‌ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Warangal: ఫారిన్ చాక్లెట్ పిల్లాడి ప్రాణం తీసింది, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

Warangal: ఫారిన్ చాక్లెట్ పిల్లాడి ప్రాణం తీసింది, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు

Hyderabad Metro Rail : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

స్క్విడ్ గేమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు - 78 ఏళ్ల వయసులో ఏంటిలా?

స్క్విడ్ గేమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు - 78 ఏళ్ల వయసులో ఏంటిలా?