News
News
X

Youtuber Suicide : వీడియోలకు వ్యూస్ రావడంలేదని యూట్యూబర్ సూసైడ్

Youtuber Suicide : యూట్యూబ్ లో తన వీడియోలకు వ్యూస్ రావడంలేదని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఈ విద్యార్థి లైవ్ లో గేమ్స్ ఆడడంలో దిట్ట.

FOLLOW US: 

Youtuber Suicide : సోషల్ మీడియా ఎంట్రీతో యువత లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి. రోజుకో వీడియో లేదా ఫొటో షూట్ తో సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ ఉండాలి. పోస్టు చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావాలి, వేలల్లో లైక్ లు రావాలి. ఒకవేళ వ్యూస్ రాకపోతే అక్కడితో వదిలేయడంలేదు. వ్యూస్ కోసం కొందరు పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వాటిని తలచుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మరికొందరైతే మరింత సీరియస్ గా తీసుకుని ఆత్మహత్య వరకూ వెళ్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వ్యూస్ రావడంలేదని 

హైదరాబాద్ సైదాబాద్‌లో ఓ యూట్యూబర్ తన వీడియోలకు వ్యూస్ రావడంలేదని సూసైడ్ చేసుకున్నాడు. లైవ్‌లో గేమ్స్‌ ఆడుతూ యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసేవాడు విద్యార్థి డీనా.  అతడు ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. యూట్యూబ్‌లో తన ఛానల్ కు వ్యూయర్స్‌ పెరగడంలేదంటూ ఓ వీడియోలో ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వీడియో పోస్టు చేసిన కొద్దిసేపటికే అతడు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటి క్రితం లైవ్ లో గేమ్ ఆడుతూ డీనా తన బాధను చెప్పుకున్నాడు.  ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచన కూడా చేశాడు. లైవ్‌లో గేమ్స్‌ ఆడడంలో దిట్ట అయినా డీనా, యూట్యూబ్‌లో selflo గేమ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు.  

మానసిక ఒత్తిడితో ఆత్మహత్య 

యూ ట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రావడం లేదని  ఓ ఇంజినీరింగ్ విద్యార్థి భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో ఓ  విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. క్రాంతి నగర్ లో ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో యూట్యూబ్ లో తన గేమింగ్ ఛానల్ కు వ్యూస్ రావడంలేదని మానసిక ఒత్తిడితో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

Also Read : Kamareddy News : కామారెడ్డి జిల్లాలో దారుణం, కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త

Published at : 21 Jul 2022 04:14 PM (IST) Tags: TS News Hyderabad News YouTube Videos youtuber suicide less views

సంబంధిత కథనాలు

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో  జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం

Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?