అన్వేషించండి

Crime News: ప్రాణం తీసిన జ్యోతిషం పిచ్చి- భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య

జ్యోతిషం పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఆలుమగల మధ్య అగ్గి రాజేంసింది. భార్య ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లింది. ఇంతకీ అసలు ఏం జరిగింది...? జ్యోతిషం ప్రాణం తీయడమేంటి..?

Hyderabad Crime News: జ్యోతిషం (Astrology) పిచ్చి.. మహిళ ప్రాణం తీసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో... భర్త వదిలేస్తాడేమో అన్న భయం ఆమెను పట్టిపీడించింది. ఆ  ఆలోచన మనుసులో పెట్టుకుని... తరచూ భర్తతో గొడవపడుతూ వచ్చేది. ఆమె తీరుతో విసిగిపోయిన భర్త చేయిచేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది.. ఆత్మహత్య  చేసుకుందా ఇల్లాలు. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లోనే జరిగింది.

హైదరాబాద్‌ (Hyderabad)లోని అంబర్‌పేట(Amberpet)లో ఉండే చందు-స్వరూప దంపతుల కుమార్తె బబిత (28)కు.. ఐదేళ్ల క్రితం బాలంరాయికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రామకృష్ణ అలియాస్‌  రాము(31)తో పెళ్లి జరిగింది. కానాజిగూడలోని ఇందిరానగర్‌లో వీరు కాపురం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ఆదివారం (జనవరి 7వ తేదీ) బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు భార్యాభర్తలు. బర్త్‌డే వేడుకలకు బంధుమిత్రులంతా హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులు మాత్రం హాజరుకాలేదు. సోమవారం (జనవరి 8వ తేదీ) ఉదయం బబిత భర్త విధులకు వెళ్లాడు. తర్వాత రెండు గంటలకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి చిన్నారి ఇంటికి వచ్చాడు.. తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూసి కింది పోర్షన్‌లో ఉన్న బాబాయికి చెప్పాడు. వెంటనే ఆమె దించి.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే బబిత మృతిచెందింది. బబిత తల్లిదండ్రులు ఆమె భర్త రాముపై దాడిచేశారు. అదనపు కట్నం వేధింపులతోనే మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే అత్తింటివారి వారు చెప్తున్నది వేరేలా ఉంది. బబితకు జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ. జ్యోతిషం నమ్మొద్దని బబితను ఆమె భర్త రాము పదేపదే కోరేవాడు. ఈ విషయంలో ఇటీవల వారి మధ్య వాగ్వాదం జరిగింది. రాము అందరిముందు బబితను కొట్టాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్తున్నారు. పోలీసులు విచారణలోనూ ప్రాథమింగా ఇదే తేలింది.

అసలు ఏం జరిగిందంటే...?
బబితకు ఉన్న జ్యోతిషం పిచ్చే కొంపముంచింది. ఆమెకు జ్యోతిషం అంటే ఎంతో నమ్మకం. ఎప్పుడూ యూట్యూబ్‌లో జ్యోతిషం వీడియోలు చూస్తూ ఉండేది. భవిష్యత్‌ ఎలా ఉంటుంది... ఫ్యూచర్‌లో ఏం జరగబోతోంది. మంచి జరుగుతుందా..? చెడు జరుగుతుందా..? అనేది ఎప్పుడు జ్యోతిషం వీడియోలు చూస్తూ తెలుసుకునేది. బబితకు పెళ్లి జరిగి బాబు పుట్టిన తర్వాత కూడా... జ్యోతిషంపై పిచ్చి పోలేదు. ఇటీవల జ్యోతిషం వీడియోలో.... తన జాతకం ప్రకారం దంపతులు విడిపోతారని తెలుసుకుంది బబిత. ఈ విషయాన్ని బలంగా నమ్మి తీవ్ర మనస్తాపం చెందింది. పదేపదే భర్త దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆమె ప్రశ్నలతో విసిగిపోయాడు భర్త రాము. ఒక సమయంలో అందరి ముందు ఆమెపై చేయి చేసుకున్నాడు. భర్త కొట్టాడన్న మనస్తాపంతోనే బబిత ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెప్తున్నారు.

బబిత తల్లిదండ్రులు మాత్రం వరకట్న వేధింపుల వల్లే ఆమె ఉరివేసుకుందని ఫిర్యాదు చేశారు. స్థానికులు, అత్తింటివారు మాత్రం జ్యోతిషం విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ఇరువర్గాల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Plug-in Hybrid SUV: 1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
Embed widget