News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Hyderabad News: డబ్బులియ్యకపోతే వీడియో టెలికాస్ట్ చేస్తా.. రిపోర్టర్ బెదిరింపులు, చివరికి..

ఇతరులకు సంబంధించిన ఓ కేసులో రిపోర్టర్ మరో వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వకపోవడంతో ఏకంగా వ్యవహారం లాక్కోవడం వరకూ వెళ్లింది.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌లో ఓ కేబుల్ టీవీ ఛానెల్ రిపోర్టర్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఏకంగా ఇతరులకు సంబంధించిన ఓ కేసుతో మరో వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వకపోవడంతో ఏకంగా వ్యవహారం లాక్కోవడం వరకూ వెళ్లింది. దీంతో రిపోర్టర్ ఆగడాలు బయటికి వచ్చాయి. 

ఓ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఆ కేసుతో నీకు సంబంధం ఉందంటూ రిపోర్టర్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న పి.అఖిల్‌ అనే వ్యక్తి నాగారంలో ఉంటున్నాడు. గత నెల 30న నమోదైన పోక్సో కేసులో ఓ నిందితుడితోపాటు అఖిల్‌కు కూడా సంబంధం ఉందని.. తన వద్ద ఆధారాలున్నాయని రిపోర్టర్ ముందుకొచ్చాడు. వీటిని బయటపెట్టకుండా ఉండాలంటే తనకు కనీసం రూ.50 వేలు ఇవ్వాలని అఖిల్‌ మేనమామ భాస్కర్‌కు యాదాద్రి కేబుల్‌ ఛానెల్‌ విలేకరి రాజ్‌ కుమార్‌ ఫోన్‌ చేసి బెదిరించాడు. 

ఆగస్టు 30 వ తేదీన జవహర్‌ నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చరణ్‌ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడితో అఖిల్‌కు స్నేహముందని.. ఈ నేరంలో అతడు పాలుపంచుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని బెదిరించాడు. తమ వద్ద ఉన్న వివరాలు, ఫొటోలు వీడియోలు తమ ఛానెల్‌లో ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు. వాటిని ప్రసారం చేయకుండా ఉండాలంటే తనకు రూ.50 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశాడు.

ఈ క్రమంలో ఆగస్ట్‌ 31న భోగారం వెళ్తున్న అఖిల్‌ను రాజ్‌ కుమార్‌తో పాటు మరోవ్యక్తి బెదిరించి అతడి వద్ద ఉన్న రూ.10 వేల నగదును లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, మరో రూ. 40 వేలు చెల్లించాలని బెదిరించారు. లేని పక్షంలో వీడియోలు తమ చానెల్‌లో ప్రసారం చేస్తామని బెదిరించారు. ఈ నెల 2న దమ్మాయిగూడా పద్మశాలీ వెంచర్‌కు అఖిల్‌ను మరోసారి పిలిచి మరికొంత మంది విలేకర్లకు కూడా డబ్బులు ఇవ్వాలని రాజ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశాడు. బ్యాంకు వివరాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్‌ చేయాలని లేకపోతే అంతుచూస్తామని బెదిరించాడు. ఈ బెదిరింపులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి అఖిల్‌ స్పందించలేదు. 

దీంతో శుక్రవారం అతను చెన్నాపురం నుంచి వస్తుండగా నోబుల్‌ పాఠశాల వద్ద అఖిల్‌ను రాజ్‌ కుమార్‌ అడ్డగించి చేయిచేసుకొని రూ.50 వేల విలువైన సెల్‌ ఫోన్‌ను లాక్కున్నాడు. దీంతో బాధితుడు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేబుల్ టీవీ రాజ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Published at : 05 Sep 2021 09:18 AM (IST) Tags: hyderabad Real estate pocso act news Hyderabad Reporter Jawahar nagar

ఇవి కూడా చూడండి

SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

టాప్ స్టోరీస్

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
×