అన్వేషించండి

Gun Firing in Hyderabad: మాదాపూర్‌లో తుపాకీ కాల్పులు, నడిరోడ్డుపైనే వ్యక్తి దారుణ హత్య!

Gun Firing in Hyderabad: హైదరాబాద్ లో కాల్పుల కలకలం సంచలం రేపింది. మాదాపూర్ లోని నీరూస్ వద్ద ఓ ముజ్జు అనే వ్యక్తి ఇస్మాయిల్ ను పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. 

Gun Firing in Hyderabad: హైదరాబాద్ లో సోమవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ లోని నీరూస్ సిగ్నల్ వద్ద ఉదయం మూడు గంటల సమయంలో రౌడీ షీటర్‌ ను దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రౌడీ షీటర్ ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌ లో మరో రౌడీషీటర్ ముజ్జు కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ కారులో వెళుతుండగా.. మాదాపూర్ నీరూస్ వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ముజ్జు అతడిని ఆపాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ముజ్జు ఆరు రౌండ్‌లు కాల్పులు జరపాడు. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో ఇస్మాయిల్ అక్కడిక్కడే మరణించాడు. అయితే ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయ పడ్డాడు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ..

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా.. ముజ్జు, ఇస్మాయిల్ ఇద్దరూ స్నేహితులేనని తెలుస్తోంది. వీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ముజ్జు అరే మైసమ్మ టెంపుల్ సమీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదో గ్యాంగ్ వార్‌(Gang war)గా తెలుస్తోంది. జైల్లో ఏర్పడ్డ పరిచయంతో ఇరువురు సెటిల్మెంట్‌ల కోసం ముఠాగా ఏర్పడినట్టు సమాచారం. 

డబ్బు పంపకంలో తేడాలు వచ్చే...

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య డబ్బు పంపకంలో తేడా వచ్చి.. ఇరువురి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని తెలుస్తోంది. ఎక్కడో చంపేసి నీరూస్ వద్ద శవాన్ని పడేసినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఇస్మాయిల్ మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే త్వరలోనే కేసును పూర్తిగా దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిజా నిజాలు పూర్తిగా తెలిసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తాం అన్నారు. అయితే ఈ హత్య గ్యాంగ్ వార్ అని తెలుస్తున్నట్లు చెప్పారు. గాయ పడిన వ్యక్తి కొంచెం కోలుకోగానే విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులకు శిక్ష పేడేలా చేస్తామని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on Potti Sriramulu | పొట్టిశ్రీరాములకు అగౌరవం కలిగించాలనే ఉద్ధేశం లేదు | ABP DesamLeopard in Tirupati SV University  | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP DesamSunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABPSunita Williams Return to Earth | భూమ్మీద దిగనున్న సునీతా విలియమ్స్..ముహూర్తం అప్పుడే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Sunitha And Wilmore Latest News: సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే ముహూర్తం ఫిక్స్‌
సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే ముహూర్తం ఫిక్స్‌
Reverse Digital Arrest: డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
TTD News:  శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
Embed widget