News
News
X

Munugode ByElections: హైదరాబాద్‌లో రూ.2.5 కోట్ల హవాలా నగదు పట్టివేత, వారంలో రెండోసారి

ఇటీవల దాదాపు రూ.2 కోట్ల వరకు అధికారులు స్వాధీనం చేసుకోగా, ఆదివారం రూ.2.5 కోట్ల నగదును అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

FOLLOW US: 
 
మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ అలా విడుదలైందో లేదో నియోజకవర్గంతో పాటు హైదరాబాద్‌లో హవాలా నగదు భారీగా డబ్బు పట్టుబడుతోంది. ఇటీవల దాదాపు రూ.2 కోట్ల వరకు అధికారులు స్వాధీనం చేసుకోగా, ఆదివారం మరోసారి అంతకుమించిన నగదు దొరికింది. రూ.2.5 కోట్ల నగదును అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

రూ.2.5 కోట్లు నగదు స్వాధీనం 
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై భారీ ట్రావెలర్స్ బ్యాగ్‌తో నగదును ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్నారు. అనుమానం వచ్చి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా ఆ బ్యాగులో రూ. 2,49,79,000 (2 కోట్ల 49 లక్షల 79 వేల రూపాయలు) ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రిసీప్ట్, పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా నిందితులు అవేమీ లేవని సమాధానమిచ్చారు. దీంతో టాస్క్ ఫోర్స్ ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.

బేగంబజార్ వ్యాపారి హవాలా దందా
గుజరాత్ కు చెందిన లలిత్ హవాలా దందా నిర్వహిస్తున్నాడు. బేగంబజార్ లో నివసించే లలిత్ ఇటీవల బీజేపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా రాజం మండలానికి చెందిన బచ్చు రాము కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడు బోయాన్షి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలోని తన కొలీగ్ సత్యనారాయణ అనే వ్యక్తి చెప్పినట్టుగా రాము శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.76లో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆ నగదును తీసుకొన్నాడు. రూ.2.5 కోట్ల నగదును బేగంబజార్ లో ఉండే లలిత్ కు చేరవేయాల్సి ఉంది. 

రాము వద్ద ఉన్న నగదును తన వద్దకు తీసుకురావాలని బీజేపీ నేత లలిత్ రాజస్థాన్‌కు చెందిన అశోక్‌ సింగ్‌, గుజరాత్‌కు చెందిన ఈశ్వర్‌లాల్‌ పటేల్‌ ను పురమాయించాడు. వీరిద్దరూ నగదు తీసుకోస్తుండగా జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ సమీపంలో పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగదు ఇచ్చిన రాముతో పాటు తీసుకురావడానికి వచ్చిన ఈశ్వర్‌లాల్‌ పటేల్‌, అశోక్‌ సింగ్‌ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నగదు పంపించిన ఢిల్లీ వ్యక్తి సత్యనారాయణ, వ్యాపారి లలిత్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతుండటంతో ఎన్నికలకు సంబంధిచిన కోణంలోనూ విచారణ చేపట్టే అవకాశం ఉంది.

News Reels

Hawala Money: హైదరాబాద్ పోలీసులు ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. చంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్ వద్ద 79 లక్షల 25వేల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. చంద్రాయణ గుట్ట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానంగా కనిపించిన రెండు కార్లను ఆపి సోదాలు చేశారు. అందులో 79.25 లక్షల డబ్బు కనిపించింది. అయితే డబ్బు తరలిస్తున్న వ్యక్తులు ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారు నడుపుతున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్, హైదరాబాద్ కు చెందిన వెంకట్ రెడ్డి, శేఖర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Published at : 10 Oct 2022 07:45 AM (IST) Tags: Hyderabad Hawala Money Hyderabad Police Hyderabad Task Force Money Seized in Hyderabad

సంబంధిత కథనాలు

Vijaya Durga Devi Temple: విశాఖ విజయ దుర్గాదేవి ఆలయంలో చోరీ, అమ్మవారి నగలు, హుండీ మాయం!

Vijaya Durga Devi Temple: విశాఖ విజయ దుర్గాదేవి ఆలయంలో చోరీ, అమ్మవారి నగలు, హుండీ మాయం!

Nellore School : నెల్లూరులో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై పోక్సో కేసు నమోదు

Nellore School : నెల్లూరులో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై పోక్సో కేసు నమోదు

Nellore News : అబ్బాయిలపై లైంగిక దాడి, నెల్లూరులో యువకుడు వికృత చర్య!

Nellore News : అబ్బాయిలపై లైంగిక దాడి, నెల్లూరులో యువకుడు వికృత చర్య!

Srikalahasti: వైసీపీ ఎమ్మెల్యే బావమరిది ఆత్మహత్యాయత్నం, చేతులు కోసుకోవడంతో కలకలం

Srikalahasti: వైసీపీ ఎమ్మెల్యే బావమరిది ఆత్మహత్యాయత్నం, చేతులు కోసుకోవడంతో కలకలం

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

టాప్ స్టోరీస్

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్