అన్వేషించండి

Crime : 69 ఏళ్ల వయసులో పెళ్లి కోసం ఆశపడ్డాడు - ఓ మహిళ కూడా రెడీ - అక్కడే అసలైన ట్విస్ట్

Hyderabad: హైదరాబాద్‌లో ఓ 69 ఏళ్ల పెద్ద మనిషి పెళ్లి కోసం ప్రకటన ఇచ్చాడు. ఇలాంటి ప్రకటనల కోసం వేచి చూసేవారు వల వేశారు. ఆ తర్వాత ఏమయిందంటే ?

69-year-old Hyderabad man loses Rs 12L in matrimonial scam : పాతికేళ్లకు పెళ్లి చేసుకోవాలి.. ముఫ్పై ఏళ్లు దాటితే పిల్లను ఇవ్వడానికి ఎవరూ పెద్దగా ముందుకు రారు..అంత కన్నా ముదిరిపోతే ఇక లైఫ్ లాంగ్ బ్యాచిలర్‌గా ఉండిపోవాలన్న భయం ఉన్న రోజులు ఇవి. అయితే హైదరాబాద్‌లోని ఓ పెద్ద మినిషి మాత్రం  69 ఏళ్లకు కూడా పెళ్లి చేసుకోవచ్చన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. రెండేళ్ల క్రితం అతని భార్య అనారోగ్యంతో చనిపోవడంతో తోడుగా ఓ వ్యక్తి ఉండాలనుకుని పెళ్లి చేసుకునేందుకు వధువు కావలెను.. రెండో వివాహం అయినా పర్వాలేదు అని ఓ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్‌లో  ప్రకటన ఇచ్చాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. 

ఆ మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని కొంతమంది కాల్ చేశారు. కొన్ని కాల్స్ తర్వాత చత్తీస్ ఘఢ్ నుంచి ఓ మహిళ నుంచి కాల్‌కు ఆ పెద్దాయన ఆకర్షితుడయ్యాడు. తన పేరు లలితా శుక్లా అని పరిచయం చేసుకున్న ఆ మహిళ పెళ్లి చేసుకోవడానికి అంగీకిరంచింది. అయితే ముందుగా ఫోన్‌లో మాట్లాడుకుని మనసులు తెలుసుకుందామని చెప్పడంతో ఆ పెద్దాయన అంగీకరించాడు. ఇలా మాటలు చెప్పుకుంటున్న  సమయంలోనే ఆ లలితా శుక్లాకు చాలా కష్టాలు వచ్చాయి. ఓ సారి తన తల్లిదండ్రులకు..మరోసారి సోదరుడుకు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరారు. 

ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు

ఆ తర్వాత కూడా ఆమె కుటుంబం చాలా సార్లు ఇబ్బందుల్లో పడింది. అన్ని సార్లు ఈ పెద్దాయనే ఆదుకున్నారు. అలా కష్టం వచ్చిందని స్వీట్ వాయిస్ తో అడగగానే ఈ పెద్దాయన డబ్బులు పంపేవారు. తన కోసం బతకడానికి వస్తున్న మహిళ కోసం ఆ మాత్రం చేయలేనా అని ఆ పెద్దయన ఎమోషనల్ అయ్యేవాడు. అయితే ఈ కష్టాలు సినిమా కష్టాల్లాగే పెరిగిపోతున్నాయి కానీ.. పెళ్లి చేసుకునే తేదీ మాత్రం దగ్గరకు రావడం లేదు. పెళ్లి సంగతి తర్వాత కనీసం కలుద్దామన్నా రావడం లేదు... తాను వస్తానన్నా అంగీకరించడం లేదు. దీంతో ఈ కష్టాల వెనుక ఏదో కథ ఉందని పెద్దాయనకు అర్థం అయింది. అప్పటికే రూ. పన్నెండు లక్షలు ఆమెకు సమర్పించుకున్నారు. 

Also Read: ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Embed widget