బేగంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉమెన్స్ హాస్టల్ ముసుగులో అక్రమ సంతాన సాఫల్య, అండాల సేకరణ దందా గుట్టు రట్టయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా వలస కార్మికుల నుంచి అండాలు సేకరించి ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
Illegal Surrogacy Network: పైకి ఉమెన్స్ హాస్టల్, లోపల ఐవీఎఫ్ సరోగసీ దందా.. బిహార్, బెంగాల్ గ్యాంగ్ అరెస్ట్!
Illegal Surrogacy Network: హైదరాబాద్‌లో మరో అక్రమ సరోగసీ దందా బయటపడింది. పైకి ఉమెన్స్ హాస్టల్ బోర్డు పెట్టి లోపల వలస కార్మికుల అండాలు సేకరిస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

- బేగంపేటలో హాస్టల్ ముసుగులో అక్రమ సరోగసీ దందా వెలుగులోకి.
- వలస మహిళల నుంచి గుట్టుచప్పుడు కాకుండా అండాలు సేకరిస్తున్న ముఠా.
- పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో సహా 8 మందిని అరెస్టు చేశారు.
- పంకజ్ సోనీ ముఠాతో సంబంధాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
Illegal Surrogacy Network: ఇటీవల సంచలనం సృష్టించిన 'సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్' తరహాలోనే హైదరాబాద్ బేగంపేటలో మరొక అక్రమ సంతాన సాఫల్య దందా వెలుగులోకి వచ్చింది. పైకి ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్ బోర్డు తగిలించి, లోపల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా వలస కార్మికుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా అండాలు సేకరించి ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్న ముఠా పోలీసులు పట్టుకున్నారు.
హాస్టల్‌పై దాడి – 8 మంది అదుపులోకి
గురువారం రాత్రి అందిన సమాచారంతో బేగంపేట ప్రకాశ్ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉమెన్స్ హాస్టల్‌పై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నిర్వహకురాలితో పాటు 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన నిరుపేద మహిళా వలస కూలీల నుంచి అండాలను సేకరించి సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సరోగసీ నెట్‌వర్క్ దందా
పురుషుల నుంచి వీర్యం, మహిళల నుంచి అండాలు సేకరించి ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించడంతో పాటు, పిల్లలు లేని దంపతుల కోరిక మేరకు సరోగసీ ద్వారా పిల్లలను అందించే దందా గత ఏడాది కాలంగా ఇక్కడ సాగుతున్నట్లు తెలిసింది. వలస మహిళల అడ్రస్‌లు, హాస్టల్‌లో ఎంతకాలంగా ఉంటున్నారు, ఎంతమంది నుంచి అండాలు సేకరించారు, ఎంతమందిని సరోగసీకి ఎంపిక చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును సీపీ సుమతి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Also Read: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
పంకజ్ సోనీ గ్యాంగ్‌తో లింకులు?
గతంలో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక క్లినిక్‌లో రోడ్డు పక్కన ఉండే బిచ్చగాళ్లు, జులాయిల నుంచి వీర్యాన్ని, మహిళల నుంచి అండాలను సేకరించి గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలించే పంకజ్ సోనీ ముఠా పట్టుబడింది. నాటి కేసులో డోనర్లకు రూ. 1,000 నుండి రూ. 4,000 వరకు చెల్లించేవారు. ప్రస్తుతం బేగంపేటలో పట్టుబడిన ఈ కొత్త ముఠాకు కూడా పంకజ్ సోనీ గ్యాంగ్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Frequently Asked Questions
హైదరాబాద్ బేగంపేటలో ఇటీవల వెలుగులోకి వచ్చిన అక్రమ దందా ఏమిటి?
ఈ అక్రమ కార్యకలాపాల్లో ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు?
పోలీసులు హాస్టల్‌పై దాడి చేసి నిర్వహకురాలితో పాటు 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరు నిరుపేద మహిళా వలస కూలీల నుంచి అండాలు సేకరించి సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ నెట్‌వర్క్ ఏయే కార్యకలాపాలు నిర్వహించేది, ఎంత కాలం నుండి నడుస్తోంది?
ఈ ముఠా పురుషుల వీర్యం, మహిళల అండాలు సేకరించి ఐవీఎఫ్ కేంద్రాలకు సరఫరా చేయడంతో పాటు, సరోగసీ ద్వారా పిల్లలను కూడా అందిస్తోంది. ఈ దందా గత ఏడాది కాలంగా జరుగుతున్నట్లు తెలిసింది.
ఈ ముఠాకు గతంలో పట్టుబడిన పంకజ్ సోనీ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా?
పంకజ్ సోనీ గ్యాంగ్‌తో ఈ కొత్త ముఠాకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పంకజ్ సోనీ ముఠా డోనర్లకు రూ.1,000 నుండి రూ.4,000 వరకు చెల్లించేది.
ట్రెండింగ్ వార్తలు






















