By: ABP Desam | Updated at : 01 Apr 2023 07:33 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
డేటా చోరీ కేసు(Image Credit : Pixabay)
Data Theft Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డేటా చోరీలో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత డేటా చోరీ కేసును సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో మరొక నిందితుడిని శనివారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసింది. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజను అరెస్టు చేసిన పోలీసులు... నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లలో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలను నిందితుడు సేకరించి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇన్ స్పైర్ వెబ్జ్ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా చోరీచేసిన డేటాను నిందితుడు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ ప్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టాగ్రామ్, బుక్ మై షో, ఆప్ స్టాక్స్ సంస్థల నుంచి నిందితుడు వ్యక్తిగత డేటా చోరీ చేశాడు. అలాగే బైజూస్ నుంచి 9 నుంచి 12 తరగతులకు చెందిన విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రో సిటీల నుంచి వినయ్ భరద్వాజ డేటా చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు.
4.5 లక్షల మంది ఉద్యోగులు
డేటా లీక్ కేసులో సంచలనాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 66.9 కోట్ల మంది వ్యక్తిగత డేటాను లీక్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో ఈ డేటా చోరీ జరిగింది. ఈ కేసులో నిందితుడైన వినయ్ భరద్వాజ్ 6 మెట్రో పాలిటిన్ నగరాల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. డీమార్ట్, నీట్, పాన్‌కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఆదాయపన్ను, డిఫెన్స్‌కు సంబంధించిన అధికారుల డేటా చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు.
ఈడీ కేసు నమోదు
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఈడీ(ED) రంగంలోకి దిగింది. సైబారాబాద్ లో నమోదు అయినా ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 66.9 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. రక్షణ రంగానికి చెందిన పలువురు అధికారుల ఈ-మెయిల్స్, వాళ్లు పనిచేసే చోటు ఇతర వివరాల సైతం నిందితుల వద్ద ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు కోసం ఇచ్చిన డేటాను లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ముఠా అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో డేటా చోరీ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద రక్షణ రంగంతో పాటు, బ్యాంక్, పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డుదారుల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు
Nellore Tragedy: నెల్లూరులో విషాదం, పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు దుర్మరణం!
Tirupati Fire Accident: టపాసుల గోడౌన్ లో అగ్నిప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
Car Accident: చెట్టుని ఢీకొట్టిన కారు, ఎగిసిపడిన మంటలు - కొత్త పెళ్లి జంట సజీవదహనం
Food Poisoning: ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ - 26 మంది విద్యార్థులకు అస్వస్థత
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!