అన్వేషించండి

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ నేరగాళ్ల వలలో పడి పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చేందుకు పోలీసులు ఓ మార్గం సూచించారు. ఇందుకు బాధితులు నేరం జరిగిన వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

 Cyber Crime : బ్యాంకు ఖాతాలోని సొమ్మును సైబర్ నేరగాళ్లు కొట్టేశారా? ఆ డబ్బును వెనక్కి రప్పించుకునేందుకు ఓ మార్గం ఉందంటున్నారు పోలీసులు. సైబర్ నేరం జరిగిన వెంటనే తక్షణ సాయం కోసం 1930 నంబరుకు ఫోన్ చేసి కంప్లైంట్ నమోదు చేయాలి. ఈ ఉచిత కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే, సంబంధిత బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసే వీలుంది. ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదునైనా ఈ కాల్ సెంటర్ ని అప్రోచ్ అవ్వవచ్చు. సైబర్ ఆర్థిక నేరాలు ఫిర్యాదులకు గతంలో ఉన్న 155280 నంబర్ ను మార్చిన కేంద్ర హోంశాఖ 1930 కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు పోలీసు స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకునే వీలు కల్పించింది. ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. తెలంగాణకు సంబంధించి 1930 సేవలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం విభాగంలో ఏర్పాటు చేశారు. కొద్ది నెలల క్రితం అందుబాటులో వచ్చిన 1930 సేవల ద్వారా ఇప్పటికే ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఈ హెల్ప్ లైన్ 24/7 పనిచేస్తుంది. సైబర్ క్రైమ్ బాధితుల నుంచి ఆన్లైన్లో ఫిర్యాదులు స్వీకరణకు T4C అనే ప్రత్యేక పోర్టల్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. 

ఆన్ లైన్ లో ఫిర్యాదు 

ఆన్లైన్ మోసానికి గురైన వారిలో చాలామంది పోలీసు స్టేషన్ అంటే భయంతో, పరువు పోతుందనో, ఇతర కారణాలతో పోలీసులను ఆశ్రయించరు. అయితే, సైబర్ మోసాలకు గురైన వారు ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఆన్లైన్ పోర్టలు అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో దీన్ని T4C ( Telangana Cyber Crime Co-ordination Centre )గా నిర్వహిస్తున్నారు. బాధితులు www.cybercrime.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఎక్కడి నుంచైనా సరే తమ ఫిర్యాదును పంపవచ్చు. ఈ పోర్టల్లో నమోదైన ఫిర్యాదు ఏ ఏరియా సైబర్ పోలీసు స్టేషన్ కు వెళ్తుంది అక్కడి సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారు. వాటి ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటారు.

నేరగాళ్ల ఖాతా ఫ్రీజ్ 

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయి డబ్బు పొగొట్టుకున్న వారికి 1930 హెల్ప్ లైన్ ద్వారా తక్షణ సాయం అందే అవకాశముంది. ఈ కాల్ సెంటర్ లో పనిచేసే సిబ్బంది అన్ని బ్యాంకులు, యూపీఐ వ్యాలెట్లకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లను నేరుగా సంప్రదించేలా ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. డబ్బు పొగొట్టుకున్న బాధితులు హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తే సిబ్బంది జరిగిన మోసానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి,  బాధితుడు ఏ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు పొగొట్టుకున్నాడో తెలుసుకుని, ఆ బ్యాంకు నోడల్ అధికారికి సమాచారం ఇస్తారు. ఆ అధికారి బాధితుని ఖాతాను పరిశీలించి డబ్బు ఏ ఖాతాకు బదిలీ అయ్యిందో గుర్తించి, సంబంధిత బ్యాంకు అధికారికి సమాచారం పంపిస్తారు. దీంతో ఆ అధికారులు ఆ ఖాతాను ఫ్రీజ్ చేసేస్తారు. ఈ విధంగా అన్ని బ్యాంకుల నోడల్ అధికారులు స్పందించి బాధితుని డబ్బు చివరిగా ఎక్కడికి చేరిందో గుర్తించి ఆయా బ్యాంకుల అధికారులకు సమాచారం పాస్ చేస్తారు.

నగదు విత్ డ్రా చేసినా సరే 

ఈ ప్రక్రియలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ఏదో ఒక బ్యాంకులో ఫ్రీజ్ అవుతుంది. ఆ ఖాతా వివరాల ఆధారంగా మోసం చేసిన వారిని గుర్తిస్తారు. ఒకవేళ ఖాతాను ఫ్రీజ్ చేసే లోపు నగదును విత్ డ్రా చేసేస్తే.. నగదు బదిలీ అయిన విధానం ఆధారంగా సైబర్ నేరగాళ్ల ఆచూకీ తెలుకుంటారు. బ్యాంకులు ఇచ్చే ఆధారాల సాయంతో పోలీసులు నేరస్థులను పట్టుకుంటారు. ఇదంతా జరగాలంటే బాధితులు వీలైనంత త్వరగా కాల్ సెంటర్ ను సంప్రదించి ఫిర్యాదు చెయ్యాల్సి ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget