Hyderabad Crime News : కారులో జీపీఎస్ ట్రాకర్ పెట్టి భర్త మర్డర్ కు ప్లాన్, చివరిలో ట్విస్ట్!
Hyderabad Crime News : ప్రియుడితో కలిసి భర్త మర్డర్ కు ప్లాన్ చేసిందో మహిళ. భర్త కారుకు జీపీఎస్ అమర్చి సుపారీ గ్యాంగ్ కు పని పూర్తి చేయమని చెప్పింది. ఇంతలో పోలీసుల ఏంట్రీతో సీన్ రివర్స్ అయింది.

Hyderabad Crime News : ప్రియుడి మోజులో భర్తనే హతమార్చేందుకు సుపారీ ఇచ్చిందో ఇల్లాలు. అంతే కాదు భర్త కారుకు జీపీఎస్ ట్రాకింగ్(GPS Tracking) అమర్చి సుపారీ గ్యాంగ్ తో హత్య చేయాలని చూసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్(Hyderabad) నగరంలో జరిగింది. ఈ మొత్తం క్రైమ్ స్టోరీలో ప్రియుడు దర్శకత్వం వహించాడు. ప్రియురాలి సహాయంతో భర్త కారుకి జీపీఎస్ అమర్చారు. అసలు విషయం తెలుసుకున్న భర్త ఎల్బీనగర్ పోలీసులను(LB Nagar Police) ఆశ్రయించడంతో క్రైమ్ థ్రిల్లర్ వెలుగులోకి వచ్చింది.
కటకటాల పాలైన ప్రియుడు, ప్రియురాలు
వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. బంధాలను మరిచిపోయి ఎంతటి దారుణాలైనా చేయిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ ఘటన వివాహేతర సంబంధాలకు ఎంతకు దారితీస్తాయో మరొకసారి రుజువైంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసేందుకు కిరాయి గ్యాంగ్(Rowdy Gang) ను పురమాయించింది. ఈ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ కటకటాలు పాలైయ్యారు.
కారుకు జీపీఎస్ అమర్చి సుపారీ గ్యాంగ్ కు వివరాలు
హైదరాబాద్ మన్సూరాబాద్‌లో నివాసం ఉంటున్న భాస్కర్, హరిత ఏడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు అంతా బాగానే నడిచింది. అదే కాలనీలో ఉంటున్న వెంకటేష్‌తో హరిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. భాస్కర్, హరితల మధ్య ఈ విషయంపై రోజూ గొడవలు జరిగేవి. భార్య తీరుతో విసిగిపోయిన భాస్కర్ మన్సూరాబాద్ నుంచి మకాం మార్చేశాడు. దీంతో హరిత, వెంకటేష్‌ల మధ్య దూరం కూడా పెరిగింది. తమ వివాహేతర సంబంధానికి భర్త భాస్కర్ అడ్డుపడుతున్నాడని, అతడ్ని హత్య చేయించాలని హరిత, వెంకటేష్‌లు ప్లాన్ వేశారు. నల్గొండకు చెందిన రౌడీ షీటర్ నవీన్‌కు భాస్కర్ ను హత్య చేయాలని వెంకటేష్ సుపారీ ఇచ్చాడు. భాస్కర్ కదలికలను తెలుసుకునేందుకు అతడి కారుకు భార్య హరిత జీపీఎస్ ట్రాకర్ పెట్టింది. జీపీఎస్‌ను ట్రాక్ చేసిన సుపారీ గ్యాంగ్ భాస్కర్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. కానీ భాస్కర్ జీపీఎస్ ట్రాకర్ విషయాన్ని పసిగట్టి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కుట్ర భగ్నం చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read : Warangal News: వీడియోలు రిలీజ్ చేయమంటావా? ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ప్రబుద్దుడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

