Hyderabad Crime News: అరె ఏంట్రా ఇది..! అద్దెకు తీసుకుంటారు, ఆపై ప్లాన్ అమలు చేసి జల్సాలు, చివరికి..!
యువత, విద్యార్థులు సైతం కొందరి సావాసంతో చెడు దారి పడుతున్నారు. జల్సాలకు డబ్బులు అవసరమై నేరగాళ్లతో చేతులు కలిపి జైలు పాలవుతున్నారు. హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఓ కేసు అందుకు నిదర్శనం.
Hyderabad Crime News: ఇప్పుడు కష్టపడి సంపాదించడం కంటే ఈజీగా మనీ ఎలా సంపాదించాలో ఆలోచిస్తున్నారు కొందరు. ఈ క్రమంలో యువత, విద్యార్థులు సైతం కొందరి సావాసంతో చెడు దారి పడుతున్నారు. జల్సాలకు డబ్బులు అవసరమై నేరగాళ్లతో చేతులు కలిపి జైలు పాలవుతున్నారు. హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఓ కేసు అందుకు నిదర్శనంగా మారింది.
అద్దెకు కార్లను తీసుకుంటారు. ఆపై తాకట్టు పెట్టి జల్సాలు చేస్తారు. అవసరమైతే తమదే ఆ కారు అని చెప్పి నమ్మించి విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్ బాగ్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ అలియాస్ డాన్(30) కారు డ్రైవర్. ఇదే ప్రాంతంలో నివాసం ఉండే డిగ్రీ విద్యార్థి మహ్మద్ హుస్సేన్ ఫ్రెండ్స్. వీరి తెలివితేటల్ని మంచి పనులకు బదులుగా మోసాలకు వాడుకున్నారు. గతంలో ట్రావెల్స్ నడిపిన అనుభవం ఉన్న సల్మాన్ కరోనా వ్యాప్తి తరువాత తన రూట్ మార్చేశాడు.
సల్మాన్ చెప్పిన ప్రకారం మహ్మద్ హుస్సేన్ కార్లను అద్దెకు తీసుకుంటాడు. ఓనర్లు కారు ఇవ్వడానికి ఆలోచిస్తుంటే.. మీకు కావాల్సినంత డబ్బు ఇస్తామని నమ్మించేవారు. అద్దెకు కారు తీసుకున్నాక తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటారు. ఇంకా అవసరమైతే తక్కువ ధర అని ఆశ చూపి కార్లను విక్రయించి జల్సాలు చేస్తుంటారని సౌత్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వీరి మోసాలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో ఆసిఫ్ నగర్ పోలీసులతో కలిసి నిందితులు సల్మాన్, హుస్సేన్‌లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.40 లక్షల నగదు, మూడు కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు సల్మాన్‌పై సైదాబాద్ పీఎస్‌లో చోరీ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆసిఫ్ నగర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట పీఎస్‌లలో కారు చోరీ కేసులు నమోదు కాగా, పక్కా సమాచారంతో సల్మాన్, హుస్సేన్‌లను అరెస్ట్ చేసి విచారణ చేసేందుకు ఆసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు. గతంలో వీరు ఇంకేమైనా మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
Also Read: Gold Silver Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం
Also Read: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలి