By: ABP Desam | Updated at : 16 Feb 2023 11:18 AM (IST)
Edited By: jyothi
అప్పు ఇచ్చి ఆదుకుంటున్నట్లు ఫోజులు - నోట్ల కట్టల మధ్యలో థర్మాకోల్ షీట్లు
Hyderabad Crime News: అప్పులు ఇచ్చి ఆదుకుంటున్నట్లు ఫోజులు ఇస్తారు. మీ మీద నమ్మకం కల్గితే కోట్లు అయినా ఇస్తామని చెబుతారు. అందుకోసం ఆస్తి పత్రాలు, ఫ్రాంసరీ నోట్లు, బాండ్ పేపర్లు కూడా రాయించుకుంటారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. డబ్బు ఇచ్చేటప్పుడు మోసాలకు పాల్పడుతుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకునే వారికి బారీ రేటున వడ్డీ, అలాగే నోట్ల కట్టల కింద థర్మాకోల్ పెట్టి డబ్బులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతారు. పొరపాటున ఎవరైనా అక్కడ డబ్బు చూసుకోకుండా ఇంటికి వెళ్లారంటే ఇక వాళ్ల పని అంతే. అయితే ఎట్టకేలకు ఇలా మోసాలకు పాల్పడే ముఠా పోలీసులకు చిక్కింది.
అసలేం జరిగిందంటే..?
మన్సూరాబాద్, సాయి సప్తగిరి కాలనీకి చెందిన 46 ఏళ్ల శంకరమ్మ వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకొని అప్పులు ఇస్తుంది. డబ్బులు సరిగ్గా చెల్లిస్తే, అధిక మొత్తం కూడా అప్పులు ఇస్తానంటూ నమ్మిస్తుంది. అయితే మెదక్ కు చెందిన 30 ఏళ్ల కండెల శ్రీనివాస్ ఆమెకు సహకరిస్తూ.. అప్పులకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా... ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన నీలేష్ కృష్ణారావు ప్రైవేటు ఉద్యోగి. ఇతడికి ఫైనాన్స్ వ్యాపారం చేసే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారే పుణెలో ఉండే వైభవ్, ఉత్తమ్ చందన్. వీరిద్దరూ కలిసి వ్యాపారం నిమిత్తం డబ్బుల కోసం కృష్ణారావును సంప్రదించారు. మన్సూరాబాద్, ఎరుకల నాంచారమ్మ కాలనీలో నివాసం ఉండే కొందరు రుణాలు ఇస్తుంటారని స్థానికుల ద్వారా తెలుసుకున్న కృష్ణారావు విషయనాన్ని తన స్నేహితులకు చెప్పాడు.
20 లక్షలు అప్పుగా ఇస్తే రెండు నెలల్లో 50 లక్షలు కట్టాలట..
కండెల శ్రీనివాస్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బులు ఇప్పిస్తాడని తెలుసుకున్న నీలేష్ కృష్ణారావు.. తనకు డబ్బులు కావాలని అతడిని సంప్రదించాడు. అప్పు విషయమై మాట్లాడేందుకు మన్సూరాబాద్ కు రావాలని కండెల శ్రీనివాస్ సూచించడంతో ముగ్గురు కలిసి మంగళవారం అక్కడికి చేరుకున్నారు. నాంచారన్న కాలనీలో నివాసం ఉండే ఓ ఇంట్లో వీళ్లంతా సమావేశం అయ్యారు. రెండు నుంచి మూడు కోట్ల వరకు అప్పు ఇస్తామని శ్రీనివాస్ తెలిపారు. అయితే ముందుగా 20 లక్షలు ఇస్తామని.. రెండు నెలల తర్వాత అసలు 20 లక్షలు వడ్డీతో కలుపుకొని 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. నమ్మకం కుదిరితే కోటి రూపాయల వరకు అప్పుగా ఇస్తామని షరతులు విధించారు. సంప్రదింపుల అనంతరం నీలేష్ కృష్ణారావు, వైభవ్, ఉత్తమ్ చందన్ ను కండెల శ‌్రీనివాస్ తన వెంట సాయి సప్తగిరి కాలనీలో నివాసం ఉండే వడ్డీ వ్యాపారి శంకరమ్మ ఇంటికి తీసుకెళ్లాడు.
నోట్ల కట్టల కింద థర్మాకోల్ షీట్లు.. గుర్తించిన బాధితులు
మూడు బాక్కుల్లో పెట్టి 500 రూపాయల నోట్ల కట్టలను చూపించారు. డబ్బులను నీలేష్ కృష్ణారావు, వైభవ్, ఉత్తమ్ చంద్ పరీక్షించారు. రూ.500 నోట్ల కట్టల్లో పైనా, కింద నోట్లు పెట్టి మధ్యతో థర్మాకోల్ పెట్టినట్లు గ్రహించారు. అనుమానం రావడంతో ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. డబ్బులు ఉన్న మూడు బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అందులో థర్మాకోల్ తోపాటు 23 లక్షల 45 వేల రూపాయల డబ్బును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుతో సంబంధం ఉన్న కండెల శ్రీనివాస్, శంకరమ్మ, శ్రీనివాస్ సోదరుడు కండెల రమేష్, రవి కుమార్, సుంకమ్మ, నాగయ్య, మెదక్ కు చెందిన రాములు, సౌత్ ఎండ్ పార్కు కాలనీకి చెందిన దుర్గవ్వ, నిజామాబాద్ కు చెందిన భోజనన్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!
Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా?
Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు
Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్