By: ABP Desam | Updated at : 14 Dec 2022 08:07 PM (IST)
Edited By: jyothi
కళ్లల్లో కారం చల్లి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యుల అరెస్ట్!
Hyderabad Crime News: ముందుగా ఓ ఏరియాలో ఉన్న బంగారం దుకాణాల్లో రెక్కీలు నిర్వహిస్తారు. వారికి అనుమానం రాకుండా నగలు కూడా కొంటుంటారు. ఇలా ఏ షాపులో ఎక్కువ బంగారం ఉందో గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతారు. కారం వెంట తెచ్చుకొని.. యజమానుల కళ్లల్లో కారం చల్లి ఆపై ఉన్నవన్నీ దోచేస్తారు. అయితే ఇలా హైదరాబాద్ లో దొంగతనాలకు పాల్పడే ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి మొత్తం 85 లక్షల విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. అలాగే నిందితులపై సైఫాబాద్, జూబ్లీహిల్స్, నారాయణ గూడాలో ఈ ముఠాపై 5 కేసులు ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రధాన నిందితుడు సయీద్ హుస్సేన్ అని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను పట్టుకున్నట్లు సీపీ వెల్లడించారు.
మరో కేసులో నలుగురు అరెస్ట్..
హైదరాబాద్ ఏటీఎం కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డు లేని వాటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6 తులాల బంగారం, లక్షా 18 వేల నగదు, 24 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబరాబాద్ లో వీరిపై 4 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు సైద్ ఉర్ రెహ్మాన్ మహారాష్ట్ర కు చెందిన వాడని వివరించారు. సెక్యూరిటీ గార్డు లేని ఏటీఎం కేంద్రాలకు వెళ్లి... క్యాష్ డిపాజిట్ మిషన్ లో చేయి అడ్డు పెట్టి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలా 3 నెలల నుంచి ఈ ముఠా డబ్బులు కొట్టేసింది. ఆ తర్వాత ఈ డబ్బుతో బంగారం, ఫ్లాట్లు కూడా కొనుగోలు చేశారని పోలీసులు వివరించారు.
ఇళ్లు కావాలంటూ వచ్చి యజమాని కళ్లల్లో కారం చల్లి..
వరంగల్ జిల్లా లేబర్ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధ మహిళ కళ్లలో కారం కొట్టి, చేతులు కట్టిపడేసి దోపిడీకి పాల్పడింది ఓ యువతి. ఈనెల 6వతేదిన మేఘన తనను గుర్తుపట్టకుండా బురఖా ధరించి బాధిత వృద్ధురాలి ఇంటికి వెళ్లి తన స్నేహితురాలికి ఇల్లు కిరాయికి కావల్సింది చెప్పింది. బాధిత వృద్ధురాలి తన ఇంటి కిరాయి కోసం తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఇల్లు చూపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో బురఖా ధరించిన నిందితురాలు కారం పొడిని ఒక్కసారిగా బాధిత వృద్ధురాలి కళ్లలో చల్లడంతో వృద్ధురాలు కింద పడిపోయింది. వృద్ధురాలి చేతులు కట్టేసి మెడలోని బంగారు గోలుసు దోపిడీ చేసి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై తప్పించుకుంది. చోరీ చేసిన బంగారు అభరణాన్ని మిగతా ఎల్లంబజార్ కు చెందిన ప్రేమ్ కుమార్, హనుమకొండ కుమార్ పల్లికి బెజ్జంకి సురేందర్ కు అమ్మింది. కొద్ది మొత్తం డబ్బు తీసుకోని మిగతా డబ్బు కోసం మళ్లీ వస్తానని చెప్పింది మేఘన.
వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మీల్స్ కాలనీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీ సాయంతో నిందితురాలిని గుర్తించిన పోలీసులు మంగళవారం ఉదయం నిందితురాలిని తన ఇంటిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు పాల్పడిన నేరాన్ని అంగీకరించడంతో ఆమె నుంచి డబ్బు, ద్విచక్రవాహనం, సెల్ఫోన్, బురఖాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేఘన ఇచ్చిన సమాచారంతో చోరీ సొత్తును కోనుగోలు చేసిన మిగతా ఇద్దరు నిందితుల నుంచి 60 గ్రాముల బంగారు ఆభరాణాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
Hyderabad News: హైదరాబాద్లో ‘అత్తిలి సత్తి’ - విక్రమార్కుడు సీన్ రిపీట్!
Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
Hyderabad Crime News: పెళ్లై నలుగురు పిల్లలు, తొమ్మిదేళ్లు చిన్నోడైన వ్యక్తితో సహజీవనం - ఇంతలో ఇద్దరూ మృతి!
జార్ఖండ్లో ఘోర అగ్నిప్రమాదం - వైద్యదంపతులు సహా ఆరుగురు మృతి
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు